Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 23:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అయితే దావీదు అరణ్యంలో, బలమైన కోటలలో, జీఫు అడవి కొండల్లో నివసించాడు. ప్రతిరోజు సౌలు అతన్ని వెదికాడు కాని దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అయితే దావీదు అరణ్యములోని కొండస్థలములయందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 దావీదు సురక్షితమైన కొండ ప్రాంతంలో జీఫు ఎడారిలో ఉంటున్నాడు. సౌలు ప్రతిరోజూ అతణ్ణి వెదుకుతున్నప్పటికీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 దావీదు అరణ్యములో ఉన్న దుర్గాలలోను, జీపు అరణ్యంలోని కొండలలోను తలదాచుకున్నాడు. ప్రతి రోజూ సౌలు దావీదు కోసం వెదుకుతూ ఉండేవాడు. కానీ యెహోవా దావీదును సౌలు పట్టుకొనేలా చేయలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అయితే దావీదు అరణ్యంలో, బలమైన కోటలలో, జీఫు అడవి కొండల్లో నివసించాడు. ప్రతిరోజు సౌలు అతన్ని వెదికాడు కాని దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 23:14
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా దాగుచోటు మీరే; కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా


నేను దూరంగా ఎగిరిపోయి ఎడారిలో ఉండేవాన్ని. సెలా


కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి, మనుష్యులను చంపడానికి త్వరపడతారు.


యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు.


కీడు చేయనిదే వారు నిద్రపోలేరు; ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు.


పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.


అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు?


హింసలు, శ్రమలు అంటే, అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్ర ప్రాంతాల్లో నాకు కలిగిన హింసను నేను ఎలా సహించానో అన్ని నీకు తెలుసు. అయితే ప్రభువు వాటన్నిటి నుండి నన్ను తప్పించారు.


జీఫు, తెలెము, బెయాలోతు,


మాయోను, కర్మెలు, జీఫు, యుత్తా,


తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడని తెలుసుకుని దావీదు జీఫు ఎడారిలోని హోరేషులో ఉన్నాడు.


దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, “ద్వారాలు అడ్డు గడియలు ఉన్న పట్టణం లోపలికి వెళ్లి దావీదు అందులో బందీ అయ్యాడు కాబట్టి దేవుడు అతన్ని నా చేతికి అప్పగించారు” అనుకున్నాడు.


చూడు, నా తండ్రీ, నా చేతిలో ఉన్న నీ వస్త్రాన్ని చూడు! నేను మీ వస్త్రపు అంచును కత్తిరించాను, కానీ నిన్ను చంపలేదు. నేను తప్పు చేశాను అనడానికి గాని తిరుగుబాటు చేశాను అని సూచించడానికి నా చేతిలో ఏమీ లేదని చూడండి. నేను నీకు అన్యాయం చేయలేదు, కానీ నీవు నా ప్రాణం తీయడానికి నన్ను తరుముతున్నావు.


అయితే దావీదు తనలో తాను, “ఏదో ఒక రోజు నేను సౌలు చేతిలో నాశనమవుతాను. నేను చేయగలిగిన ఉత్తమమైన పనేంటంటే ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకు పోవడమే. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశంలో నన్ను వెదకడం మానేస్తాడు, కాబట్టి నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ