Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 2:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

35 తర్వాత నా హృదయంలో, మనస్సులో ఉన్నదాని ప్రకారం చేసే నమ్మకమైన యాజకుడిని నా కోసం నేను లేవనెత్తుతాను. నేను అతని యాజక కుటుంబాన్ని స్థిరపరుస్తాను, వారు ఎల్లప్పుడూ నా అభిషిక్తుని ఎదుట సేవ చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

35 తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

35 తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషిక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

35 నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచుకుంటాను. ఈ యాజకుడు నేను చెప్పినట్లు విని, నా మాట ప్రకారం చేస్తాడు. ఈ యాజకుని వంశాన్ని నేను స్థిరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

35 తర్వాత నా హృదయంలో, మనస్సులో ఉన్నదాని ప్రకారం చేసే నమ్మకమైన యాజకుడిని నా కోసం నేను లేవనెత్తుతాను. నేను అతని యాజక కుటుంబాన్ని స్థిరపరుస్తాను, వారు ఎల్లప్పుడూ నా అభిషిక్తుని ఎదుట సేవ చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 2:35
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతేకాదు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం నుండి జరిగినట్టు దుర్మార్గులు ఇక వారిని బాధించరు. నీ శత్రువులందరి నుండి నీకు నెమ్మది కలుగజేస్తాను. “ ‘యెహోవా నీకు చెప్పేది ఏంటంటే, యెహోవాయే నీ వంశాన్ని స్థిరపరుస్తారు.


“సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు దేవా, ‘నేను నీకు రాజవంశాన్ని స్థాపిస్తాను’ అని మీరు ఈ విషయాన్ని మీ సేవకునికి తెలియజేశారు. కాబట్టి మీకు ఈ ప్రార్థన ప్రార్థించడానికి మీ సేవకునికి ధైర్యం కలిగింది.


యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను గిహోను దగ్గర అతన్ని రాజుగా అభిషేకించారు. అక్కడినుండి వారు సంతోషిస్తూ వెళ్లారు. అందుకే పట్టణం సందడిగా ఉంది. మీరు వినే శబ్దం అదే.


కాని యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, రేయీ దావీదు వ్యక్తిగత శూరులు అదోనియాతో కలవలేదు.


నేను ఆజ్ఞాపించేదంతా నీవు చేసి, నా మార్గాలను అనుసరిస్తే, నా సేవకుడైన దావీదులా నా శాసనాలు ఆజ్ఞలు పాటిస్తూ, నా దృష్టిలో సరియైనది చేస్తే నేను నీతో ఉంటాను. నేను దావీదు పట్ల చేసినట్లు నీ రాజ్యాన్ని స్థిరపరచి నీకు ఇశ్రాయేలును ఇస్తాను.


రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాను యోవాబు స్థానంలో సైన్యాధిపతిగా, సాదోకును అబ్యాతారు స్థానంలో యాజకునిగా నియమించాడు.


ఆ రోజు వారు యెహోవా సన్నిధిలో చాలా ఆనందంతో విందు చేసుకున్నారు. అప్పుడు వారు దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పాలకునిగా, సాదోకును యాజకునిగా అభిషేకించారు.


ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని ప్రేమను చూపిస్తారు.


యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,


ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కాబట్టి ఆయన వారి సొంత కుటుంబాలను వృద్ధిచేశారు.


వాటిని మేపడానికి నేను నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని కాస్తాడు; అతడు వాటిని మేపుతాడు, వాటికి కాపరిగా ఉంటాడు.


అతడు అతని సంతానం నిత్య యాజకత్వ నిబంధన కలిగి ఉంటారు ఎందుకంటే తన దేవుని ఘనత కోసం రోషం కలిగి, ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు.”


దేవుని సేవచేయడంలో కనికరం కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకునిగా ఉండడానికి, ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన అన్ని విధాలుగా వారిలా సంపూర్ణ మానవునిగా చేయబడ్డారు.


అతడు, అతని సేవకుడు గిబియా దగ్గరకు చేరుకున్నప్పుడు, ప్రవక్తల ఊరేగింపు అతనికి ఎదురైంది; దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చి, అతడు వారితో కలిసి ప్రవచించాడు.


సౌలు సమూయేలు దగ్గరి నుండి వెళ్లడానికి వెనుకకు తిరగ్గానే దేవుడు సౌలు హృదయాన్ని మార్చారు, ఆ రోజే ఈ సూచనలన్నీ నెరవేరాయి.


ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయాన్ని చూడకుండ కళ్లు మూసుకోవడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? నేను అలా చేసి ఉంటే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వారు నా మీద సాక్ష్యం చెప్పండి, అప్పుడు నేను మీకు వాటిని తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు.


కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు.


అప్పుడు మీ కుటుంబంలో మిగిలిన ప్రతి ఒక్కరూ వచ్చి ఒక వెండి ముక్క కోసం రొట్టె కోసం అతని ముందు నమస్కరించి, “నాకు తినడానికి ఆహారం లేక కష్టంగా ఉంది, నన్ను ఏదైనా యాజక సేవలో నియమించండి” ’ అని వేడుకుంటారు.”


“మీ సేవకురాలి పాపాన్ని క్షమించండి. నా ప్రభువైన మీరు యెహోవా యుద్ధాలను చేస్తున్నారు కాబట్టి నా ప్రభువు యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తారు. మీరు జీవించినంతకాలం మీకు కీడు కలుగదు.


బాలుడైన సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేశాడు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు అరుదుగా వచ్చేది; దర్శనాలు ఎక్కువగా ఉండేవి కావు.


అప్పుడు సమూయేలు పాలు త్రాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సంపూర్ణమైన దహనబలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతనికి జవాబిచ్చారు.


అయితే అతని కుమారులు అతని మార్గాన్ని అనుసరించలేదు. వారు అక్రమ సంపాదన కోసం లంచాలు తీసుకుని న్యాయాన్ని తారుమరు చేసేవారు.


అందుకు వారు, “అతడు మీకు దగ్గరలోనే ఉన్నాడు. త్వరగా వెళ్లి కలవండి; ఎందుకంటే ఈ రోజు క్షేత్రంలో ప్రజల కోసం బలి అర్పించబడుతుంది, అందుకు ఈ రోజే మా ఊరికి వచ్చాడు.


అతడు భోజనం చేయడానికి ఉన్నత స్థలానికి వెళ్లకముందే మీరు పట్టణంలోకి వెళ్లండి. అతడు వచ్చేవరకు ప్రజలు తినరు. అతడు బలిని దీవించిన తర్వాత ఆహ్వానించబడిన వారు తింటారు. మీరు ఇప్పుడే పైకి వెళ్లండి; ఈపాటికి మీరు అతన్ని కలుసుకోవల్సింది” అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ