Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 18:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 ఫిలిష్తీయుల దళాధిపతులు తరచూ యుద్ధానికి వచ్చేవారు. వారు వచ్చినప్పుడెల్లా దావీదు మిగిలిన సౌలు అధికారులందరికంటే ఎక్కువ విజయాన్ని సాధించేవాడు; కాబట్టి అతనికి ఎంతో పేరు వచ్చింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలు దేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

30 ఫిలిష్తీయుల సేనాధిపతులు మాత్రం ఇశ్రాయేలీయులపై తమ దండయాత్రలు సాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రతిసారీ దావీదు వారిని ఓడిస్తూనే ఉన్నాడు సౌలు క్రిందవున్న అధికారులందరిలో దావీదు చాలా ఉత్తమ అధికారి. అందువల్ల దావీదు చాలా ప్రసిద్ధిలోకి వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 ఫిలిష్తీయుల దళాధిపతులు తరచూ యుద్ధానికి వచ్చేవారు. వారు వచ్చినప్పుడెల్లా దావీదు మిగిలిన సౌలు అధికారులందరికంటే ఎక్కువ విజయాన్ని సాధించేవాడు; కాబట్టి అతనికి ఎంతో పేరు వచ్చింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 18:30
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, దావీదు యోవాబును తన మనుష్యులతో ఇశ్రాయేలు సైన్యమంతటితో పంపించగా, వారు అమ్మోనీయులను నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించారు. కాని దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.


నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.


రాజు మూడవ అధిపతిని అతనితో పాటు యాభైమంది మనుష్యులను పంపాడు. ఈ మూడవ అధిపతి కొండెక్కి వెళ్లి, ఏలీయా ముందు మోకాళ్లమీద ఉండి, “దైవజనుడా” అని వేడుకున్నాడు, “నా ప్రాణాన్ని మీ సేవకులైన ఈ యాభైమంది ప్రాణాలను కాపాడండి!


యెహోవా దృష్టిలో విలువైనది ఆయన నమ్మకమైన సేవకుల మరణము.


నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను.


మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.


రాజు వారిని ప్రశ్నించినప్పుడు జ్ఞానం, వివేకం విషయంలో తన రాజ్యమంతటిలో ఉన్న మాంత్రికులు, శకునగాళ్లు, అందరికంటే పది రెట్లు గొప్పగా వారునట్లు అతడు కనుగొన్నాడు.


ఎందుకంటే మీ విరోధులు ఎదిరించడానికి గాని, నిరాకరించడానికి గాని వీలుకాని మాటలను జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను.


చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి.


ఉపయోగం లేనిదిగా మనుష్యులచే తిరస్కరించబడిన, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ రాయియైన ప్రభువును సమీపించండి.


ఇప్పుడు విశ్వసించేవారికి ఈ రాయి అమూల్యమైనది. కాని విశ్వసించని వారికి, “ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది.”


సౌలు దావీదుకు మరి ఎక్కువగా భయపడ్డాడు. అతడు జీవించినంతకాలం దావీదును శత్రువుగానే చూశాడు.


దావీదు సౌలు తనను పంపిన ప్రతి చోటుకు వెళ్లి, విజయం సాధించేవాడు కాబట్టి సౌలు అతనికి సైన్యంలో ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అది సైనికులందరికి, సౌలు అధికారులకు సంతోషం కలిగించింది.


మరొకసారి యుద్ధం వచ్చినప్పుడు దావీదు వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి చాలామందిని చంపినప్పుడు వారు అతని దగ్గర నుండి పారిపోయారు.


“కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ‘నీ కుటుంబం, నీ పితరుల కుటుంబం నా సన్నిధిలో నిత్యం సేవ చేస్తారని నేను వాగ్దానం చేశాను’ అని చెప్పారు కాని ఇప్పుడు యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: ‘అది నా నుండి దూరమవును గాక! నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకరించబడతారు.


అందుకు సౌలు, “నేను పాపం చేశాను. దావీదూ నా కుమారుడా, తిరిగి రా. ఈ రోజు నీవు నా ప్రాణాన్ని విలువైనదిగా గుర్తించావు, కాబట్టి నేను మరలా నీకు హాని చేయడానికి ప్రయత్నించను. నేను ఒక మూర్ఖునిలా చాలా భయంకరమైన తప్పు చేశాను” అన్నాడు.


ఈ రోజు నీ ప్రాణానికి విలువను ఇచ్చినందుకు యెహోవా నా ప్రాణానికి విలువనిచ్చి అన్ని బాధలనుండి నన్ను విడిపించును గాక” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ