Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 7:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 అతడు కట్టించుకున్న లెబానోను అరణ్య రాజభవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్పై మూరలు, నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద దేవదారు దూలాలను వేయించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభములమీద దేవదారు దూలములు వేయబడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 అతడు లెబానోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని నాలుగు వరసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 అతడింకా “లెబానోను అరణ్యపు విశ్రాంతి గృహాన్ని” కూడ ఒకటి కట్టించాడు. అది నూట ఏభై అడుగుల పొడవు, డెబ్బది ఐదు అడుగుల వెడల్పు, మరియు నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగివుంది. దానికి నాలుగు వరుసల దేవదారు స్తంభాలు వున్నాయి. వాటి పైన నగిషీ పని చేసిన దేవదారు స్తంభ శీర్షాలు నిలుపబడ్డాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 అతడు కట్టించుకున్న లెబానోను అరణ్య రాజభవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్పై మూరలు, నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద దేవదారు దూలాలను వేయించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 7:2
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు, ప్రతి డాలుకు మూడు మీనాల బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.


రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు.


స్తంభాల మీది దూలాల పైకప్పును దేవదారుతో చేశారు. ఒక్కో వరుసలో పదిహేను స్తంభాల చొప్పున మూడు వరుసల్లో నలభై అయిదు స్తంభాలు ఉన్నాయి.


సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించి తాను కోరుకున్నదంతా సాధించిన తర్వాత,


తన ధాన్యాగారాలను, తన రథాలకు గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో లెబానోనులో తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.


సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు. ప్రతి డాలుకు మూడువందల షెకెళ్ళ బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.


నీ మెడ దంతపు గోపురం లాంటిది. మీ కళ్లు బాత్-రబ్బీం ద్వారం దగ్గర ఉన్న హెష్బోను కొలనులాంటివి. మీ ముక్కు దమస్కు వైపు చూస్తున్న లెబానోను గోపురం లాంటిది.


ప్రభువు యూదా నుండి రక్షణ కవచాన్ని తీసివేశారు, ఆ రోజున మీరు అరణ్య రాజభవనంలో ఉన్న ఆయుధాల వైపు చూశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ