Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 22:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 అయితే ఒకడు విల్లెక్కుపెట్టి గురి చూడకుండ బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలురాజుకు కవచపుకీలుమధ్యను తగిలెను గనుక అతడు–నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములోనుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 అయితే ఒకడు తన విల్లు తీసి గురి చూడకుండానే బాణం వేస్తే అది ఇశ్రాయేలు రాజు కవచం అతుకు మధ్య తగిలింది. కాబట్టి అతడు “నాకు పెద్ద గాయమైంది. రథం తిప్పి ఇక్కడనుంచి నన్ను అవతలకు తీసుకు పో” అని తన సారథితో చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

34 కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురిచూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తనసారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని ఈ ప్రదేశంనుండి బయటికి నడిపించు. యుద్ధంనుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 అయితే ఒకడు విల్లెక్కుపెట్టి గురి చూడకుండ బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 22:34
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన అధికారులతో, “నేను తీవ్రంగా గాయపడ్డాను. ఇక్కడినుండి నన్ను తీసుకెళ్లండి” అని చెప్పాడు.


కాబట్టి మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని నాశనం చేసి నిర్మూలిస్తాను.


వాటి ఛాతీ ఇనుప కవచంలా ఉంది. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరుగెత్తే అనేక గుర్రాల రథాల ధ్వనిలా ఉంది.


దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు.


సిరియా రాజు తన రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు.


అయితే యెహు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి యెహోరాము భుజాల మధ్యకు కొట్టాడు. ఆ బాణం అతని గుండెను చీల్చుకుంటూ పోవడం వలన అతడు తన రథంలో వాలిపోయాడు.


యెరూషలేము నుండి 200 మంది పురుషులు అబ్షాలోముతో పాటు వచ్చారు. అతడు వారిని అతిథులుగా రమ్మని పిలిచినప్పుడు, వారు విషయం తెలియక అమాయకంగా వెళ్లారు.


అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.


అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని అతన్ని తరమడం ఆపివేశారు.


ఆ రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది, రాజు అరామీయులకు ఎదురుగా తన రథం మీద ఉన్నాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథం అడుగు భాగానికి చేరింది. ఆ సాయంకాలం అతడు చనిపోయాడు.


ప్రభువు శాసించనప్పుడు అది జరిగేలా ఎవరు ఆజ్ఞాపించగలరు?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ