Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 21:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 అహాబు నాబోతుతో, “నీ ద్రాక్షతోట నా భవనానికి దగ్గర ఉంది కాబట్టి, నీ ద్రాక్షతోటను నాకు ఇవ్వు, నేను దానిని కూరగాయల తోటగా వాడుకుంటాను. దానికి బదులుగా, నీ తోట కంటే ఇంకా మంచి ద్రాక్షతోటను నీకు ఇస్తాను, లేదా నీకిష్టమైతే దానికి తగిన వెల చెల్లిస్తాను” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 అహాబు నాబోతును పిలిపించి–నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైనయెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 అహాబు నాబోతును పిలిపించి “నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది. కాబట్టి అది నాకివ్వు. దానిలో కూరగాయలు పండించుకుంటాను. దానికి బదులు దాని కంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను. లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఒక రోజు నాబోతును పిలిచి అహాబు ఇలా అన్నాడు: “నీ పొలం నాకు ఇచ్చివేయి. నేను దానిని కూరగాయల తోటగా మార్చాలనుకుంటున్నాను. నీ చేను నా భవనానికి దగ్గరగా వుంది. దానికి బదులు దానికంటె మంచి ద్రాక్షతోట నీకు మరొకటి ఇస్తాను. లేదా, నీకు కావాలంటే దాని విలువ డబ్బు రూపంలో చెల్లిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 అహాబు నాబోతుతో, “నీ ద్రాక్షతోట నా భవనానికి దగ్గర ఉంది కాబట్టి, నీ ద్రాక్షతోటను నాకు ఇవ్వు, నేను దానిని కూరగాయల తోటగా వాడుకుంటాను. దానికి బదులుగా, నీ తోట కంటే ఇంకా మంచి ద్రాక్షతోటను నీకు ఇస్తాను, లేదా నీకిష్టమైతే దానికి తగిన వెల చెల్లిస్తాను” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 21:2
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాము శారాయితో, “నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఏది మంచిదనిపిస్తే అది తనకు చేయి” అన్నాడు. శారాయి హాగరును వేధించింది కాబట్టి ఆమె శారాయి దగ్గర నుండి పారిపోయింది.


స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు.


అందుకు నాబోతు అహాబుతో, “నా పూర్వికుల వారసత్వాన్ని మీకు ఇవ్వకుండ యెహోవా తప్పించును గాక” అని అన్నాడు.


అందుకతడు, “నేను యెజ్రెయేలీయుడైన నాబోతుతో, ‘నీ ద్రాక్షతోటను నాకు వెండికి అమ్ము; లేదా నీకిష్టమైతే నీ తోటకు బదులుగా నేను నీకు ఇంకొక తోట ఇస్తాను’ అని అన్నాను. కాని అతడు, ‘నా ద్రాక్షతోట మీకివ్వను’ అన్నాడు” అని చెప్పాడు.


జరిగినదంతా యూదా రాజైన అహజ్యా చూసినప్పుడు, అతడు బేత్-హగ్గాన్ మార్గం గుండా పారిపోయాడు. యెహు అతని వెంటపడి, “అతన్ని కూడా చంపండి!” అని ఆజ్ఞాపించాడు. వారు గూరుకు పోయే త్రోవలో ఇబ్లెయాము దగ్గర అతన్ని తన రథంలో గాయపరిచారు, అయితే అతడు మెగిద్దోకు తప్పించుకుని వెళ్లి అక్కడ మృతిచెందాడు.


మీ పొరుగువాని ఇంటిని మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గాని, అతని దాసుని గాని దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”


తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను.


నీవు ఉద్యానవనంలోని జలాశయానివి, లెబానోను నుండి దిగువకు ప్రవహించే, నీటి ఊటలు కల బావివి.


“అయితే నీ కళ్లు, నీ హృదయం అన్యాయమైన సంపాదనపై, నిర్దోషుల రక్తాన్ని చిందించడంపై, అణచివేయడంపై, దోపిడీపై మాత్రమే దృష్టి పెట్టాయి.”


ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు.


మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఈజిప్టు దేశం వంటిది కాదు; అక్కడ మీరు విత్తనాలు విత్తి కూరతోటలలో చేసినట్లు వాటికి కాళ్లతో నీరు పెట్టారు.


మీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని ఇంటిని గాని స్థలాన్ని గాని అతని దాసుని గాని, దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”


అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకునేవారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు.


కాబట్టి ఆకీషు దావీదును పిలిచి అతనితో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నిజంగా యథార్థవంతుడవు; సైన్యంలో నీవు నాతో పాటు కలిసి పని చేయడం నాకు ఇష్టమే. నీవు నా దగ్గరకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నావు, కానీ ఈ అధికారులు నిన్ను తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు.


అతడు మీ ద్రాక్షతోటల నుండి ఒలీవతోటల నుండి శ్రేష్ఠమైన వాటిని తీసుకుని తన సహాయకులకు ఇస్తాడు.


అయితే వారు, “మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రాజు కావాలి” అని అడగడం సమూయేలుకు నచ్చలేదు; కాబట్టి అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ