Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 2:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 “సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీ వెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షలమీదను పడజేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 అయితే సెరూయా కొడుకు యోవాబు నాకు చేసిన కీడు నీకు తెలుసు. అతడు ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కొడుకు అబ్నేరుకీ, యెతెరు కొడుకు అమాశాకీ చేసినదీ నీకు తెలుసు. అతడు వారిని చంపి యుద్ధ సమయంలో చేసినట్టు శాంతి సమయంలో కూడా రక్తం ఒలికించి తన నడికట్టు మీదా తన చెప్పుల మీదా రక్తం మరకలు అయ్యేలా చేసుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 “సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏమి చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు కుమారుడైన అబ్నేరును, యెతెరు కుమారుడైన అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు కోవాలి. వారు యుద్ధ సమయంలో ప్రజలను చంపారనే కోపంతో అతడా పని చేశాడు. కాని చంపబడిన ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున నేనతనిని శిక్షించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 “సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 2:5
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్షాలోము యోవాబుకు బదులుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు. అమాశా తండ్రి ఇష్మాయేలీయుడైన యెతెరు. అతని తల్లి అబీగయీలు యోవాబు తల్లియైన సెరూయాకు సోదరియైన నాహాషు కుమార్తె.


కాని అతడు యోవాబుతో, “నా చేతిలో వెయ్యి షెకెళ్ళ వెండి పెట్టినా, రాజు కుమారునిపై నేను చేయి వేయను. యువకుడైన అబ్షాలోముకు ఎవరూ హాని చేయకుండా కాపాడమని మాకందరికి వినిపించేలా రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి ఆజ్ఞ ఇచ్చాడు.


అందుకు యోవాబు, “నీవు చేసే వరకు నేను ఇలా ఎదురుచూస్తూ ఉండను” అని చెప్పి, మూడు ఈటెలు పట్టుకుని వెళ్లి, ఇంకా ప్రాణాలతో ఆ సింధూర వృక్షానికి వ్రేలాడుతున్న అబ్షాలోము గుండెల్లోకి దిగేలా కొట్టాడు.


రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను, “నన్ను బట్టి యువకుడైన అబ్షాలోముపై దయ చూపించండి” అని ఆదేశించాడు. అబ్షాలోము గురించి రాజు దళాధిపతులందరికి ఆజ్ఞ ఇవ్వడం సైన్యమంతా విన్నారు.


సెరూయా కుమారుడైన యోవాబు, దావీదు మనుష్యులతో కలిసి బయలుదేరి వెళ్లి వారిని గిబియోను కొలను దగ్గర కలుసుకున్నారు. ఒక గుంపు కొలనుకు ఈ ప్రక్కన మరో గుంపు కొలనుకు ఆ ప్రక్కన కూర్చున్నారు.


సెరూయా ముగ్గురు కుమారులైన యోవాబు, అబీషై, అశాహేలు అక్కడే ఉన్నారు. అశాహేలు అడవిలేడిలా చాలా వేగంగా పరుగెత్తగలడు.


యోవాబు ఎడమ చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కాబట్టి అజాగ్రత్తగా ఉన్నాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో పొడవగానే అమాశా ప్రేగులు బయటకు వచ్చి నేల మీద పడి అక్కడే అతడు చనిపోయాడు. అప్పుడు యోవాబు అతని తమ్ముడైన అబీషైలు బిక్రి కుమారుడైన షేబను వెంటాడుతూ వెళ్లారు.


అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు.


నేను రాజుగా అభిషేకించబడినా ఈ రోజు నేను బలహీనుడిని అయిపోయాను. ఈ సెరూయా కుమారులు నా కంటే బలవంతులు. ఈ చెడ్డ పని చేసినవాడికి యెహోవాయే తగిన శిక్ష విధించి ప్రతీకారం చేస్తారు” అన్నాడు.


అదోనియా సెరూయా కుమారుడైన యోవాబుతో, యాజకుడైన అబ్యాతారుతో చర్చించాడు. వారు అతనికి తమ సహకారం అందించారు.


అతడు చిందించిన రక్తానికి యెహోవా అతనికి ప్రతిఫలమిస్తారు. ఎందుకంటే అతనికంటే మంచివారు, ఉత్తములు అయిన నేరు కుమారుడు ఇశ్రాయేలు సేనాధిపతియైన అబ్నేరు, యెతెరు కుమారుడు యూదా సేనాధిపతియైన అమాశా అనే ఇద్దరిపై అతడు నా తండ్రియైన దావీదుకు తెలియకుండా దాడి చేసి వారిని ఖడ్గంతో చంపాడు.


నిర్దోషుల ప్రాణాధారమైన రక్తపు మరక నీ బట్టలపైన ఉంది. వారు లోపలికి చొచ్చుకొని వస్తూ ఉంటే నీవు వారిని పట్టుకోలేదు. ఇంత జరిగినా,


వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; నేను వారిని శిక్షించినప్పుడు వారు పడద్రోయబడతారు” అని యెహోవా చెప్తున్నారు.


యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను, నడుముకు తోలుదట్టీ ధరించేవాడు. అతడు మిడతలు, అడవి తేనె తినేవాడు.


“పొరుగువాన్ని రహస్యంగా చంపేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ