Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 2:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 అందుకు రాజైన సొలొమోను తన తల్లితో, “అదోనియా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? ఎంతైనా అతడు నాకు అన్న కాబట్టి అతని కోసం యాజకుడైన అబ్యాతారు కోసం సెరూయా కుమారుడైన యోవాబు కోసం రాజ్యాన్ని కూడా అడగవచ్చు కదా” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 అందుకు రాజైన సొలొమోను–షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారుడైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 అందుకు సొలొమోను “షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా” అని తన తల్లితో అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 అది విన్న సొలొమోను రాజు, “అబీషగును అతని కిమ్మనే ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న గనుక అతను రాజు కావటానికి కూడా అనుమతి ఇమ్మని నన్నెందుకు అడగటం లేదు? యాజకుడైన అబ్యాతారు, యోవాబు కూడా అతనికి మద్దతు ఇస్తారేమో!” అని తన తల్లితో అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 అందుకు రాజైన సొలొమోను తన తల్లితో, “అదోనియా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? ఎంతైనా అతడు నాకు అన్న కాబట్టి అతని కోసం యాజకుడైన అబ్యాతారు కోసం సెరూయా కుమారుడైన యోవాబు కోసం రాజ్యాన్ని కూడా అడగవచ్చు కదా” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 2:22
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ యజమాని ఇంటిని నీకు అప్పగించాను, అతని భార్యలను నీ కౌగిటిలోనికి చేర్చాను. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను నీకు అప్పగించాను. ఇవన్నీ చాలవని నీవు అనుకుంటే నేను నీకు మరిన్ని ఇచ్చి ఉండేవాన్ని.


అందుకు అహీతోపెలు అబ్షాలోముతో, “రాజభవనానికి కాపలాగా మీ తండ్రి ఉంచిన అతని ఉంపుడుగత్తెలతో పడుకోండి. అప్పుడు మీ తండ్రికి మీరు మరింత అసహ్యులు అయ్యారని ఇశ్రాయేలీయులందరు తెలుసుకుంటారు. మీ పక్షాన ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా శక్తిమంతులవుతారు” అన్నాడు.


అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబను ఇలా అడిగాడు, “హగ్గీతు కుమారుడైన అదోనియా రాజయ్యాడని, మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదని నీవు వినలేదా?


అప్పుడతడు, “నీకు తెలిసినట్లు, రాజ్యం నాకు చెందాల్సింది. ఇశ్రాయేలీయులంతా నన్ను తమ రాజుగా చూశారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, రాజ్యం నాది కాక నా సోదరునిది అయ్యింది; ఎందుకంటే అది యెహోవా నుండి అతనికి వచ్చింది.


గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకా కుమారుడైన అబ్షాలోము మూడవ కుమారుడు; హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు;


యెరూషలేములో అతనికి పుట్టినవారు వీరు: అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబకు పుట్టిన షమ్మువ, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కుమారులు.


యేసు వారితో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా?” అని అడిగారు. వారు, “మేము త్రాగగలం” అని జవాబిచ్చారు.


యేసు వారితో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా లేదా నేను పొందిన బాప్తిస్మం మీరు పొందగలరా?” అని అడిగారు.


మీరు అడిగినప్పుడు మీ సంతోషాల కోసం ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీకు ఏమి దొరకదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ