1 రాజులు 16:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అంతేకాక బయెషాకు, అతని వంశానికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహు ప్రవక్త ద్వారా వచ్చింది. ఎందుకంటే యెహోవా దృష్టిలో అతడు చెడు చేసినందుకు, యరొబాము కుటుంబాన్ని నిర్మూలం చేసినందుకు అతడు యెహోవాకు కోపం రేపాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మరియు బయెషా యరొబాము సంతతి వారివలెనేయుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటినిబట్టియు, అతడు తన రాజును చంపుటనుబట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 యరొబాము వంశం వారిలాగే బయెషా తన పనులతో యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి ఆయనకు కోపం పుట్టించాడు. దానంతటిని బట్టి, యరొబాము కుటుంబాన్నంతా చంపినందుకూ అతనికీ అతని వంశం వారికీ వ్యతిరేకంగా యెహోవా, హనానీ కొడుకు ప్రవక్త అయిన యెహూ ద్వారా తన వాక్కు వినిపించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 కావున ప్రవక్తయగు యెహూకు యెహోవా ఒక వర్తమానం అందించాడు. ఆ వర్తమానం బయెషాకు, అతని కుటుంబానికి వ్యతిరేకంగా వుంది. యెహోవా దృష్టిలో నీచమైన కార్యాలనేకం బయెషా చేశాడు. ఇది యెహోవాకు కోపకారణమయ్యింది. అతనికి ముందు యరొబాము సంతతి వారు చేసిన పనులే బయెషా కూడ చేశాడు. బయెషా యరొబాము కుటుంబం వారినందరినీ చంపివేసినందుకు కూడా యెహోవా కోపంగా వున్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అంతేకాక బయెషాకు, అతని వంశానికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహు ప్రవక్త ద్వారా వచ్చింది. ఎందుకంటే యెహోవా దృష్టిలో అతడు చెడు చేసినందుకు, యరొబాము కుటుంబాన్ని నిర్మూలం చేసినందుకు అతడు యెహోవాకు కోపం రేపాడు. အခန်းကိုကြည့်ပါ။ |