Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 11:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 వారు మిద్యాను నుండి బయలుదేరి పారానుకు వెళ్లారు. తర్వాత పారాను నుండి కొందరిని వెంటబెట్టుకొని ఈజిప్టు రాజైన ఫరో దగ్గరకు వెళ్లారు, ఫరో హదదుకు ఇల్లు, ఆహారం, భూమి ఇచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 వాళ్ళు మిద్యాను దేశం నుండి బయలు దేరి పారాను ప్రాంతానికి వచ్చి, అక్కడినుంచి కొందరిని వెంటబెట్టుకుని ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో అతనికి ఇల్లు, భూమి ఇచ్చి ఆహారం ఏర్పాటు చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 వారు మిద్యాను దేశము నుండి పారానుకు వెళ్లారు. పారాను దేశంలో వారితో మరి కొందరు కలిశారు. వారంతా కలిసి ఈజిప్టుకు వెళ్లారు. ఈజిప్టు రాజగు ఫరో వద్దకు వెళ్లి సహాయం అర్థించారు. హదదుకు ఒక ఇంటిని, కొంత భూమిని ఫరో ఇచ్చాడు. ఫరో అతనికి అన్ని అండ దండలు ఇచ్చి, ఆహారం కూడా ఏర్పాటు చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 వారు మిద్యాను నుండి బయలుదేరి పారానుకు వెళ్లారు. తర్వాత పారాను నుండి కొందరిని వెంటబెట్టుకొని ఈజిప్టు రాజైన ఫరో దగ్గరకు వెళ్లారు, ఫరో హదదుకు ఇల్లు, ఆహారం, భూమి ఇచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 11:18
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

హోరీయులను, శేయీరు కొండ సీమలో ఎడారి దగ్గర ఉన్న ఎల్ పారాను వరకు తరిమి ఓడించారు.


అతడు పారాను ఎడారిలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది.


ఆమె అతనికి కన్న కుమారులు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు.


ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతానము.


అయితే అప్పుడు హదదు చిన్నవాడు, అతడు తన తండ్రి సేవకులైన కొంతమంది ఎదోమీయుల అధికారులతో ఈజిప్టుకు పారిపోయాడు.


ఫరోకు హదదు అంటే చాలా ఇష్టం కలిగి అతనికి తన భార్య తహ్పెనేసు రాణి యొక్క సోదరిని ఇచ్చి పెళ్ళి చేశాడు.


ఫరో ఈ సంగతి విన్నప్పుడు, అతడు మోషేను చంపడానికి ప్రయత్నించాడు, కాని మోషే ఫరో దగ్గరనుండి పారిపోయి మిద్యానులో జీవించడానికి వెళ్లాడు, అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.


దేవుడు తేమాను నుండి వచ్చాడు, పరిశుద్ధుడు పారాను పర్వతం నుండి వచ్చాడు. సెలా ఆయన మహా వైభవం ఆకాశాలను కప్పివేసింది భూమి ఆయన స్తుతితో నిండింది.


ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి బయలుదేరి మేఘం పారాను అరణ్యంలో ఆగేవరకు స్థలం నుండి స్థలానికి ప్రయాణించారు.


మోయాబీయులు మిద్యాను పెద్దలతో, “ఈ దండు, ఒక ఎద్దు పొలం లోని గడ్డిని లాక్కున్నట్లు, మన చుట్టూ ఉన్న సమస్తాన్ని లాక్కుంటుంది” అని అన్నారు. కాబట్టి ఆ సమయంలో మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు,


మిద్యాను స్త్రీతో పాటు చంపబడిన ఇశ్రాయేలీయుని పేరు సలూ కుమారుడైన జిమ్రీ. ఇతడు షిమ్యోను కుటుంబంలో నాయకుడు.


వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించిన వారి సహోదరి, కొజ్బీ, మిద్యానీయుల నాయకుని కుమార్తె, పెయోరులో జరిగిన సంఘటన ఫలితంగా తెగులు వచ్చినప్పుడు చంపబడింది.”


అప్పుడే ఇశ్రాయేలీయులలో ఒకడు మిద్యాను స్త్రీని మోషే సమాజమందరి ఎదుట, ఆ శిక్షను బట్టి వారు సమావేశ గుడార ద్వారం దగ్గర ఏడుస్తున్న సమయంలో తీసుకువచ్చాడు.


యొర్దానుకు తూర్పున ఉన్న అరణ్యంలో అనగా పారానుకు తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహబ్ అనే స్థలాలకు మధ్య సూఫుకు ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవి.


అతడు ఇలా అన్నాడు: “యెహోవా సీనాయి పర్వతం నుండి వచ్చారు శేయీరు నుండి వారి మీద ఉదయించారు; పారాను పర్వతం నుండి ప్రకాశించారు. వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చారు, దక్షిణం నుండి, పర్వత వాలు నుండి వచ్చారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ