Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 10:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఆమె గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనును కలిసి అతనితో తన మనసులో ఉన్న సంగతులన్నిటిని గురించి మాటలాడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 10:2
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా అబ్రాహాముతో సంభాషణ ముగించిన తర్వాత, ఆయన వెళ్లిపోయారు, అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్లాడు.


ఆమె రాజుకు 120 తలాంతుల బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి ఇచ్చినంత సుగంధద్రవ్యాలు రాజైన సొలొమోనుకు మరెప్పుడూ రాలేదు.


సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు; వివరించలేనంత కష్టమైనది రాజుకు ఏది లేదు.


హిజ్కియా రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు.


అందుకు అరాము రాజు, “సరే వెళ్లు, నేను ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం పంపిస్తాను” అన్నాడు. కాబట్టి నయమాను తనతో పది తలాంతుల వెండి, ఆరువేల షెకెళ్ళ బంగారం, పది జతల దుస్తులు తీసుకుని వెళ్లాడు.


కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలతో వెళ్లి ఎలీషా ఇంటి గుమ్మం దగ్గర ఆగాడు.


ఎవరైనా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నీవు సహించలేవా? కాని మాట్లాడకుండా ఎవరు ఉండగలరు?


వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా


తర్షీషు రాజులు దూర దేశపు రాజులు, ఆయనకు పన్నులు చెల్లిస్తారు. షేబ సెబా రాజులు కానుకలు తెస్తారు.


దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి, సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;


దక్షిణ దేశంలోని జంతువుల గురించి ప్రవచనం: సింహాలు ఆడ సింహాలు, నాగుపాములు ఎగిరే సర్పాలు, కష్టాలు బాధలున్న దేశం గుండా రాయబారులు, గాడిదల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మూపుల మీద తమ సంపదలను ఎక్కించుకొని తమకు లాభం కలిగించని ఆ దేశానికి,


“ ‘షేబ రాయమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. అన్ని రకాల సుగంధద్రవ్యాలు విలువైన రాళ్లు బంగారం ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.


వారు అలా మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నప్పుడు, యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడ నడిచారు;


మరుసటిరోజు అగ్రిప్ప రాజు అతని భార్య బెర్నీకే గొప్ప ఆడంబరంగా, ఉన్నత సైనికాధికారులతో పట్టణ ప్రముఖులతో కలిసి ప్రేక్షకుల గది లోనికి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞతో పౌలును లోపలికి తీసుకుని వచ్చారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ