Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 1:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 అప్పుడు దావీదు హగ్గీతుల కుమారుడైన అదోనియా గర్వంతో, “నేనే రాజునవుతాను” అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అతడు రథాలను, గుర్రపురౌతులను, తనకు ముందుగా పరుగెత్తడానికి యాభైమంది మనుష్యులను ఏర్పరచుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించినవాడై–నేనే రాజునగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఆ సమయంలో దావీదుకు హగ్గీతు వల్ల పుట్టిన అదోనీయా గర్వించి “నేనే రాజునవుతాను” అనుకున్నాడు. కాబట్టి అతడు రథాలనూ గుర్రపు రౌతులనూ తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది మనుషులనూ ఏర్పాటు చేసుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5-6 దావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజునౌతానని” అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. “ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 అప్పుడు దావీదు హగ్గీతుల కుమారుడైన అదోనియా గర్వంతో, “నేనే రాజునవుతాను” అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అతడు రథాలను, గుర్రపురౌతులను, తనకు ముందుగా పరుగెత్తడానికి యాభైమంది మనుష్యులను ఏర్పరచుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 1:5
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

కొంతకాలం తర్వాత అబ్షాలోము ఒక రథాన్ని, గుర్రాలను తన ముందు పరుగెత్తడానికి యాభైమంది పురుషులను అంగరక్షకులుగా సమకూర్చుకున్నాడు.


హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు; అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు;


అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబను ఇలా అడిగాడు, “హగ్గీతు కుమారుడైన అదోనియా రాజయ్యాడని, మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదని నీవు వినలేదా?


ఆ యువతి చాలా అందమైనది; ఆమె రాజును చూసుకుంటూ సేవ చేస్తూ ఉండేది, కాని రాజు ఆమెతో శారీరకంగా కలవలేదు.


హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియైన బత్షెబ దగ్గరకు వెళ్లాడు. బత్షెబ అతన్ని, “నీవు సమాధానంగా వచ్చావా?” అని అడిగింది. అతడు, “అవును, సమాధానంగా వచ్చాను” అన్నాడు.


అప్పుడతడు, “నీకు తెలిసినట్లు, రాజ్యం నాకు చెందాల్సింది. ఇశ్రాయేలీయులంతా నన్ను తమ రాజుగా చూశారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, రాజ్యం నాది కాక నా సోదరునిది అయ్యింది; ఎందుకంటే అది యెహోవా నుండి అతనికి వచ్చింది.


నన్ను స్థిరపరచి, నా తండ్రియైన దావీదు సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి, తన వాగ్దానం ప్రకారం నా కోసం రాజవంశాన్ని స్థాపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అదోనియా ఈ రోజు చనిపోవలసిందే!”


యెహోవా నాకు అనేక కుమారులను ఇచ్చారు. వారందరి నుండి, ఇశ్రాయేలీయులపై యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కుమారుడైన సొలొమోనును ఎన్నుకున్నారు.


అప్పుడు రాజైన దావీదు సమావేశంలో ఉన్నవారందరితో ఇలా అన్నాడు: “దేవుడు ఎన్నుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా చిన్నవాడు, అనుభవం లేనివాడు. మందిరం నిర్మించేది మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవా కోసం, కాబట్టి పని చాలా గొప్పది.


గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకా కుమారుడైన అబ్షాలోము మూడవ కుమారుడు; హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు;


నీవింకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని వెళ్లనివ్వడం లేదు.


నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.


నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది.


వారి దేశం వెండి బంగారాలతో నిండి ఉంది; వారి ధనానికి అంతులేదు. వారి దేశం గుర్రాలతో నిండి ఉంది; వారి రథాలకు అంతులేదు.


తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు” అన్నారు.


“నేను మీతో చెప్పేది ఏంటంటే, పరిసయ్యుని కంటే పన్నులు వసూలు చేసేవాడే దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు. తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.”


“షెకెము యజమానులను అడగండి, ‘మీకు ఏది మంచిది: యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులు మిమ్మల్ని పాలించడమా లేదా ఒక్కడు పాలించడమా?’ అని అడగండి. నన్ను గుర్తుంచుకోండి నేను మీ సమీప రక్తసంబంధిని.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ