Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 యోహాను 2:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే, ఆయన మనకు తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

3 ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనం తెలుసుకుంటాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 యోహాను 2:3
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీ ఆజ్ఞల మార్గాన నేను పరుగెడతాను, ఎందుకంటే మీరు నా గ్రహింపును విశాలపరిచారు.


అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు నేను అవమానపాలు కాను.


అతడు శ్రమ పొందిన తర్వాత జీవిత వెలుగును చూసి తృప్తి చెందుతాడు; నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు, వారి దోషాలను అతడు భరిస్తాడు.


“నేను చెప్పే మాట ప్రకారం చేయకుండా ఎందుకు నన్ను ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుస్తున్నారు?


“మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు.


నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే, నా ప్రేమలో నిలిచి ఉంటారు.


నా ఆజ్ఞల ప్రకారం మీరు చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు.


నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.


“చీకటి నుండి వెలుగు ప్రకాశించును గాక” అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింపజేశారు.


ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు.


తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. యవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించారు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.


మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు.


దీనిని బట్టి, మనం సత్యానికి సంబంధించినవారమని మనకు తెలుస్తుంది, మన హృదయాలు ఆయన సన్నిధిలో విశ్రాంతిగా ఉంటాయి;


ఆయనలో జీవించేవారు ఎవరూ పాపంలో కొనసాగరు. పాపంలో కొనసాగేవారు ఆయనను ఎన్నడూ చూడలేదు తెలుసుకోలేదు.


మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు.


ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కాబట్టి మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వారు దేవున్ని ఎరిగినవారు.


మనం దేవుని పిల్లలమని, లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉన్నదని మనకు తెలుసు.


దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా మనం దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నామని మనకు తెలుస్తుంది.


నిజానికి, దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవి కావు.


అందుకు ఆ ఘటసర్పం ఆ స్త్రీపై కోపంతో మండిపడి ఆమె మిగిలిన సంతానంతో అనగా నమ్మకంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతూ యేసు క్రీస్తు కోసం సాక్షులుగా జీవిస్తున్న వారితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లింది.


ఇది యేసు క్రీస్తుకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న దేవుని ప్రజలు సహనాన్ని చూపించాల్సిన సమయం.


“జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ