Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 6:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 నిబంధన మందసం యెహోవా మందిరంలో ఉంచబడిన తర్వాత, అక్కడ సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 నిబంధనమందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవామందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

31 యెహోవా ఒడంబడిక పెట్టె ఆలయంలో ఉంచిన తరువాత దావీదు కొందరు సంగీత విద్వాంసులను నియమించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 నిబంధన మందసం యెహోవా మందిరంలో ఉంచబడిన తర్వాత, అక్కడ సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 6:31
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచారు, దావీదు యెహోవా సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించాడు.


వారు యెహోవా మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. యాజకులు, లేవీయులు వాటిని పైకి మోసుకెళ్లారు.


దావీదు తన కోసం దావీదు పట్టణంలో భవనాలు కట్టించుకున్న తర్వాత, అతడు దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి దాని కోసం గుడారం వేయించాడు.


కాబట్టి యెహోవా నిబంధన మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు వెళ్లారు.


దావీదు, మందసాన్ని మోసిన లేవీయులందరు, సంగీతకారులు, సంగీత నాయకుడు కెనన్యా సన్నని నారతో నేసిన వస్ర్తాలు ధరించారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును కూడా ధరించాడు.


అతని కుమారుడు షిమ్యా, అతని కుమారుడు హగ్గీయా, అతని కుమారుడు అశాయా.


సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.


లేవీయుల కుటుంబ పెద్దలలో సంగీతకారులు దేవాలయపు గదుల్లో ఉండేవారు. వారు రాత్రింబగళ్ళు పని చేయాలి కాబట్టి వారికి వేరే ఏ పని అప్పగించబడలేదు.


నిర్మించేవారు యెహోవా ఆలయానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన ప్రకారం యాజకులు ప్రత్యేక వస్త్రాలను ధరించి బూరలు పట్టుకుని, ఆసాపు కుమారులైన లేవీయులు తాళాలు పట్టుకుని యెహోవాను కీర్తించడానికి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు.


“ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది; ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను, ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.


‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి.


లోపలి ఆవరణంలో లోపలి ద్వారం బయట రెండు గదులు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వారం దగ్గర దక్షిణం వైపుగా ఒకటి, తూర్పు ద్వారం దగ్గర ఉత్తరం వైపుగా ఒకటి ఉన్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ