1 దిన 22:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 దావీదు, “నా కుమారుడైన సొలొమోను చిన్నవాడు, అనుభవం లేనివాడు, యెహోవాకు కట్టవలసిన మందిరపు కీర్తి, వైభవం బట్టి అది అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందాలి. కాబట్టి దాని నిర్మాణానికి కావలసిన వాటిని నేను సిద్ధం చేస్తాను” అని చెప్పి దావీదు చనిపోవడానికి ముందే విస్తారంగా సామాగ్రిని సిద్ధం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 –నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 దావీదు “నా కొడుకు సొలొమోనుది అనుభవం లేని లేత వయస్సు. యెహోవా కోసం కట్టబోయే మందిరం దాని కీర్తిని బట్టి, అందాన్ని బట్టి, అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందినది, చాలా వైభవోపేతంగా ఉండాలి. కాబట్టి, దానికి కావలసిన సరంజామా అంతటినీ సిద్ధపరుస్తాను” అని చెప్పి, అతడు తన మరణానికి ముందు విస్తారంగా సామగ్రిని సమకూర్చాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు సొలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. యెహోవా ఆలయం చాలా గొప్పదై వుండాలి. దాని అందచందాలలోను, ఔన్నత్యంలోను ఆ దేవాలయం సాటి రాజ్యాలన్నిటిలోను మేటిదై వుండాలి. అందువల్ల దేవాలయ నిర్మాణానికి అవసరమైన అనేక ఏర్పాట్లు చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మాణానికి దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 దావీదు, “నా కుమారుడైన సొలొమోను చిన్నవాడు, అనుభవం లేనివాడు, యెహోవాకు కట్టవలసిన మందిరపు కీర్తి, వైభవం బట్టి అది అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందాలి. కాబట్టి దాని నిర్మాణానికి కావలసిన వాటిని నేను సిద్ధం చేస్తాను” అని చెప్పి దావీదు చనిపోవడానికి ముందే విస్తారంగా సామాగ్రిని సిద్ధం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။ |
ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరిట మందిరం కట్టిస్తాను. ఆయన సన్నిధిలో పరిమళ ధూపం వేయడం కోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయం సాయంకాలం, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, మా దేవుడైన యెహోవాకు నియమించబడిన పండుగ సమయాల్లో దహనబలులు అర్పించడం కోసం మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలుకు నిత్య కట్టుబాట్లుగా ఉంటాయి.