Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 12:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

40 ఇశ్రాయేలీయులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి సరిహద్దు ప్రాంతాల నుండి వారి పొరుగువారు గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు, ఎడ్ల మీద ఆహారపదార్థాలు తీసుకువచ్చారు. వాటిలో పిండి వంటకాలు, అంజూర పండ్ల ముద్దలు, ద్రాక్షపండ్ల ముద్దలు, ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువులు, గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

40 ఇశ్రాయేలీయులకు సంతో షము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదలమీదను ఎద్దులమీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్లగెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱెలను పశువులను విస్తారముగా తీసికొనివచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

40 ఇశ్రాయేలీయులకు సంతోషం కలిగింది. ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి పొలిమేరల వరకూ వారి సంబంధులు గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహారం, పిండి వంటలు, అంజూర పళ్ళ ముద్దలు, ఎండిన ద్రాక్షపళ్ళ గెలలు, ద్రాక్షామధురసం, నూనె, గొర్రెలు, పశువులు, విస్తారంగా తీసుకొచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

40 ఇశ్శాఖారు, జెబూలూను మరియు నఫ్తాలి వంశాల వారి ఇరుగు పొరుగు వారు కూడ గాడిదలమీద, ఒంటెలమీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార పదార్థాలు వేసుకొని వచ్చారు. వారు కావలసినంత పిండిని, అంజూర పండ్ల భక్ష్యాలను, ఎండుద్రాక్షను, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులను, గొర్రెలను తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలంతటా సంతోషం వెల్లివిరిసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

40 ఇశ్రాయేలీయులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి సరిహద్దు ప్రాంతాల నుండి వారి పొరుగువారు గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు, ఎడ్ల మీద ఆహారపదార్థాలు తీసుకువచ్చారు. వాటిలో పిండి వంటకాలు, అంజూర పండ్ల ముద్దలు, ద్రాక్షపండ్ల ముద్దలు, ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువులు, గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 12:40
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

దావీదు కొండమీద కొంత దూరం వెళ్లినప్పుడు, మెఫీబోషెతు సేవకుడైన సీబా అతన్ని కలవడానికి వేచి ఉన్నాడు. అతడు కళ్లకు గంతలు కట్టివున్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. వాటి మీద 200 రొట్టెలు, 100 ఎండు ద్రాక్ష గెలలు, 100 అంజూర పండ్లు ఉన్న కొమ్మలు, ఒక ద్రాక్షరసపు తిత్తి ఉన్నాయి.


ప్రజలందరు పిల్లన గ్రోవులు ఊదుతూ ఎంతో ఆనందిస్తూ అతని వెంట వెళ్లారు. ఆ శబ్దానికి భూమి అదిరింది.


అతల్యాను రాజభవనం దగ్గర చంపిన తర్వాత పట్టణం ప్రశాంతంగా ఉంది, దేశ ప్రజలంతా సంబరపడ్డారు.


వారి కుటుంబాలు వారి కోసం భోజనపదార్థాలు సిద్ధం చేశారు, కాబట్టి వారు అక్కడే తిని త్రాగి దావీదుతో పాటు మూడు రోజులు ఉన్నారు.


దావీదు వేయిమందికి వందమందికి అధిపతులుగా ఉన్నవారందరిని సంప్రదించాడు.


ఆ రోజు వారు యెహోవా సన్నిధిలో చాలా ఆనందంతో విందు చేసుకున్నారు. అప్పుడు వారు దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పాలకునిగా, సాదోకును యాజకునిగా అభిషేకించారు.


నీతిమంతులు అభివృద్ధి చెందుట పట్టణానికి సంతోషకరం; దుష్టులు నశించినపుడు ఆనంద కేకలు వినబడతాయి.


నీతిమంతులు వృద్ధి చెందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు; దుష్టులు ఏలునపుడు, ప్రజలు మూల్గుతారు.


యెహోవా నాతో, “వెళ్లు, నీ భార్యను వేరే వ్యక్తి ప్రేమించినా, వ్యభిచారిగా ఉన్నా ఆమెకు నీ ప్రేమను చూపించు. ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళను పూజించి పవిత్ర ద్రాక్షపండ్ల ముద్దలను ఆశించనప్పటికి, యెహోవా వారిని ప్రేమించినట్లు ఆమెను ప్రేమించు” అని చెప్పారు.


అప్పుడు అబీగయీలు ఆలస్యం చేయకుండా వెంటనే రెండువందల రొట్టెలు, రెండు ద్రాక్షరసం తిత్తులు, వండిన అయిదు గొర్రెల మాంసం, అయిదు మానికల వేయించిన ధాన్యం, వంద ద్రాక్షగుత్తులు, రెండువందల అంజూర పండ్ల ముద్దలు తీసుకుని గాడిదల మీద ఎక్కించింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ