Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెఫన్యా 3:6 - పవిత్ర బైబిల్

6 దేవుడు చెపుతున్నాడు: “నేను మొత్తం జన సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణా దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం చేశాను, అక్కడకు ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ నివసించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసియున్నాను, జనములేకుండను వాటియందెవరును కాపురముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 నేను అన్యజనులను నిర్మూలం చేయగా వారి కోటలు పాడైపోతాయి. ఒకడైనా సంచరించకుండా వారి వీధులు నిర్మానుష్యమై పోతాయి. జనసంచారం లేకుండా వాటిలో ఎవరూ కాపురముండకుండా వారి పట్టణాలను లయపరచిన వాణ్ణి నేనే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “నేను దేశాలను నాశనం చేశాను; వాటి కోటలు పడగొట్టబడ్డాయి. నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను, ఎవరూ వాటి గుండా వెళ్లరు. వాటిలో ఎవరూ నివసించకుండా వారి పట్టణాలను నిర్జనంగా చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “నేను దేశాలను నాశనం చేశాను; వాటి కోటలు పడగొట్టబడ్డాయి. నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను, ఎవరూ వాటి గుండా వెళ్లరు. వాటిలో ఎవరూ నివసించకుండా వారి పట్టణాలను నిర్జనంగా చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెఫన్యా 3:6
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను నా ప్రజల కోసం చేయాలనీ ఉద్దేశించిన సంగతి అది. రాజ్యాలన్నింటినీ శిక్షించటానికి నేను నా చేతి బలంప్రయోగిస్తాను.”


కనుక యెహోవా దూత వెళ్లి, అష్షూరి వారి బసలో ఒక లక్ష ఎనభై అయిదు వేలమంది మనుష్యులను చంపేశాడు. మర్నాడు ఉదయం మనుష్యులు లేచి చూడగా, వారి చుట్టూ చచ్చిన శవాలే వారికి కనబడ్డాయి.


అప్పుడు నేను “ప్రభూ, ఎన్నాళ్లు నేను ఇలా చేయాలి?” అని అడిగాను. యెహోవా జవాబిచ్చాడు, “పట్టణాలు నాశనం చేయబడి, ప్రజలు వెళ్లిపోయేంత వరకు ఇలా చేయి. ఇళ్లలో మనుష్యులు ఎవ్వరూ నివసించకుండా ఉండే అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి, నిర్జనం అయ్యేంతవరకు ఇలా చేయుము.”


ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా? యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా? యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా? రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది? జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.


మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల సువాసన నేను ఆఘ్రాణించను.


ఫిలిష్తీ ప్రజలారా, సముద్ర తీరంలో నివసించే ప్రజలారా, యెహోవా దగ్గరనుండి వచ్చిన ఈ సందేశం మిమ్మల్ని గూర్చిందే. కనాను దేశమా, పాలస్తీనా దేశమా, నీవు నాశనం చేయబడతావు. అక్కడ ఎవ్వరూ నివసించరు!


ఇతర దేశాలను వారి మీదికి ఒక తుఫానులా తీసుకువస్తాను. వారెవరో వీరికి తెలియదు; కాని వారు దేశంలో తిరిగాక అది నాశనమై పోతుంది. రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.”


అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను.


మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి.


వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు.


పశ్చిమాన మహా సముద్రానికి, యొర్దానుకు మధ్యగల దేశమంతా మీ ప్రజలు తీసుకోవచ్చని నేను మీతో చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీకు ఇస్తానని చెప్పిన దేశం అది. కానీ మీరు ఇంకా దానిని స్వాధీనం చేసుకోలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ