జెఫన్యా 3:5 - పవిత్ర బైబిల్5 కాని దేవుడు ఇంకా ఆ పట్టణంలో ఉన్నాడు. మరియు ఆయన మంచివాడుగానే కొనసాగుతున్నాడు. దేవుడు తప్పు ఏమీ చేయడు. ఆయన తన ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రజలు మంచి నిర్ణయాలు చేసేందుకు ఆయన వారికి ప్రతి ఉదయం సహాయం చేస్తాడు. కాని ఆ దుర్మార్గులు తాము చేసే చెడ్డ పనుల విషయంలో సిగ్గుపడరు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయవిధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అయితే న్యాయం తీర్చే యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఆయన అక్రమం చేసేవాడు కాడు. అనుదినం తప్పకుండా ఆయన న్యాయ విధులు వెల్లడి చేస్తాడు. ఆయనకు రహస్యమైనదేమీ లేదు. అయినా నీతిహీనులకు సిగ్గులేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అయితే యెహోవా నీతిమంతుడు; ఆయన తప్పు చేయరు. అనుదినం ఆయన మానకుండా, ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు, అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అయితే యెహోవా నీతిమంతుడు; ఆయన తప్పు చేయరు. అనుదినం ఆయన మానకుండా, ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు, అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు. အခန်းကိုကြည့်ပါ။ |
ఈ ప్రజలను నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి ఈ సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి.) “చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గూర్చి మీకు ఎవరు చెప్పారు? చాలాకాలం నుండి ఈ సంగతులను విడువక మీకు ఎవరు చెప్పారు? యెహోవాను నేనే, ఈ సంగతులు మీకు చెప్పాను. నేను ఒక్కడను మాత్రమే దేవుడను. నావంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకో మంచి దేవుడు ఉన్నాడా? తన ప్రజలను రక్షించే ఇంకో దేవుడూ ఉన్నాడా? లేడు మరి ఏ దేవుడు లేడు.
యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా లంచాలు తీసుకుంటారు. వారలా చేసి న్యాయస్థానంలో తమ తీర్పు ఇస్తారు. ప్రజలకు బోధించేముందు యెరూషలేము యాజకులకు వేతనం చెల్లించాలి. ప్రవక్తలు భవిష్యత్తులోకి చూసేముందు ప్రజలు వారికి డబ్బు చెల్లించాలి. అప్పుడా నాయకులు, “మనకు ఏరకమైన కీడూ రాదు! యెహోవా మనపట్ల ఉన్నాడు!” అని అంటారు.