జెఫన్యా 2:7 - పవిత్ర బైబిల్7 అప్పుడు యూదా వారిలో శేషించిన వారికి ఆ దేశం చెందుతుంది. ఆ యూదా ప్రజలను యెహోవా జ్ఞాపకం చేసుకొంటాడు. ఆ ప్రజలు ఒక విదేశంలో బందీలుగా ఉన్నారు. కాని యెహోవా వారిని వెనుకకు తీసుకొని వస్తాడు. అప్పుడు యూదా ప్రజలు ఆ పొలాల్లో తమ గొర్రెలను గడ్డి మేయనిస్తారు. రాత్రిళ్ళు అవి అష్కెలోను ఖాళీ ఇండ్లలో పండుకొంటాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమునవారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉంటుంది. వారు అక్కడ తమ మందలు మేపుతారు. చీకటి పడ్డాక వారు అష్కెలోను ఇళ్ళలో నిద్రపోతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఆ ప్రాంతం యూదా వంశంలో మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది. వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు, వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి ఆయన వారిని రప్పిస్తారు. వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు. సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఆ ప్రాంతం యూదా వంశంలో మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది. వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు, వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి ఆయన వారిని రప్పిస్తారు. వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు. సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |
మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”
ప్రజలు తమ ధనాన్ని వెచ్చించి పంట భూములు కొంటారు. ప్రజలు తమ క్రయదస్తావేజులపై సంతకాలు చేసి వాటిపై ముద్రలు వేసి భద్రపరుస్తారు. ప్రజలు తమ దస్తావేజులపై సంతకాలు చేయునట్లు సాక్షులను నియమిస్తారు. బెన్యామీను వంశస్తులు నివసించే ప్రాంతంలో కూడా ప్రజలు మళ్లీ భూములు కొంటారు వారు యెరూషలేము చుట్టుపట్ల పొలాలు కొంటారు. వారు యూదా పట్టణ ప్రాంతాలలోను, మన్య ప్రాంతాలలోను, పడమటి కొండవాలు ప్రాంతంలోను, మరియు దక్షిణ ఎడారి ప్రాంతంలోను భూములు కొంటారు. మీ ప్రజలందరిని నేను తిరిగి స్వదేశానికి తీసికొని వస్తాను. గనుక ఇదంతా జరుగుతుంది.” ఈ సందేశం యెహోవా నుండి వచ్చినది.
సీయోను కుమారీ, నీవు బాధపడు. ప్రసవించే స్త్రీలా నీవు నొప్పిని అనుభవించి “బిడ్డను” కను. ఎందుకంటే నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు వదిలివేస్తావు. నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు. నీవు బబులోను (బాబిలోనియా)కు వెళతావు. కానీ నీవక్కడనుండి రక్షింపబడతావు. యెహోవా అక్కడికి వెళ్లి, నిన్ను నీ శత్రువులనుండి తిరిగి తీసుకొని వస్తాడు.
కనుక నేను బ్రతికి ఉన్నంత నిశ్చయంగా, మోయాబు మరియు అమ్మోను ప్రజలు సొదొమ, గొమొర్రాల్లా నాశనం చేయబడతారు. నేను ఇశ్రాయేలీయుల దేవుడను, సర్వశక్తిగల యెహోవాను. ఆ దేశాలు శాశ్వతంగా సర్వనాశనం చేయబడతాయని నేను వాగ్దానం చేస్తున్నాను. వారి దేశంనిండా కలుపు మొక్కలు పెరిగి పొతాయి. వారి దేశం మృత సముద్రపు ఉప్పుచేత కప్పబడిన దేశంలా ఉంటుంది. నా ప్రజలలో శేషించినవారు ఆ దేశాన్ని, అందులో మిగిలిన వాటన్నింటినీ తీసుకొంటారు.”