Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెఫన్యా 2:10 - పవిత్ర బైబిల్

10 మోయాబు మరియు అమ్మోను ప్రజలు గర్వపడి, దేవుని ప్రజలను గేళిచేసి, సర్వశక్తిగల యెహోవా ప్రజలపట్ల క్రూరంగా పవర్తించారు. వారిని అవమాన పర్చారు. కనుక వాళ్లకు అవి జరిగే తీరుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 వారు అతిశయపడి సేనల ప్రభువు అయిన యెహోవా ప్రజలను దూషించారు గనక వారి గర్వాన్నిబట్టి అది వారికి సంభవిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ఈ విధంగా వారు గర్వంతో, సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ఈ విధంగా వారు గర్వంతో, సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెఫన్యా 2:10
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు. యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు.


మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “‘ఎంత కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు అని వారు అతనితో చెప్పారు.


నీవు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా వెళ్లనివ్వడంలేదు.


మోయాబు ప్రజలు చాలా గర్విష్ఠులని, మోసగాళ్లని మేము విన్నాం. ఈ ప్రజలు తిరుగు బాటు దారులు, గర్విష్ఠులు. అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే.


యెహోవా ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు చుట్టు పట్లవుండే ప్రజలకు నేనేమి చేస్తానో నీకు చెపుతాను. ఆ జనులు చాలా దుర్మార్గులు. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన రాజ్యాన్ని వారు ధ్వంసం చేశారు. ఆ దుష్ట జనులను నేను పెల్లగించి, వారి రాజ్యంనుండి బయటికి త్రోసివేస్తాను. వారితో పాటు యూదా వారిని కూడా పెల్లగించుతాను.


“‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’ అని మీరు చెప్పుకోలేరు.


“మోయాబు గర్వాన్ని గురించి విన్నాము. అతడు మిక్కిలి గర్విష్ఠి. తాను చాలా ముఖ్యమైన వానిలా అతడు తలంచినాడు. అతడు ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనేవాడు. అతడు మహా గర్విష్ఠి.”


యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి. తనకు జరుగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు. ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది. ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు. “ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు! తనెంత గొప్పవాడినని నా శత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: యెరూషలేము నాశనమైనప్పుడు మీరు సంతోషపడ్డారు. మీరు మీ చేతులు చరిచి, కాళ్లు దట్టించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని అవమానపరుస్తూ మీరు వేడుక చేసుకున్నారు.


ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను పరలోక మందున్న రాజును కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అణగ ద్రొక్కుతాడు.


పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకుపోయినప్పుడు ఇశ్రాయేలు శత్రువులతో నీవు చేతులు కలిపావు. పరదేశీయులు ఇశ్రాయేలు నగర ద్వారంలోకి వచ్చి, యెరూషలేములో ఎవరు ఏ భాగాన్ని ఆక్రమించుకోవాలనే విషయంలో చీట్లు వేశారు. ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో ఒకనిమాదిరిగా నీవు ఉన్నావు.


నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరంమీద గుహలలో నీవు నివసిస్తున్నావు. నీ ఇల్లు కొండల్లో ఎత్తున ఉంది. అందువల్ల, ‘నన్నెవరూ కిందికి తేలేరు’ అని, నీకు నీవు మనస్సులో అనుకుంటున్నావు.”


యెహోవా ఇలా అంటున్నాడు: “మోయాబు మరియు అమ్మోను ప్రజలు ఏమి చేసారో నాకు తెలుసు! ఆ ప్రజలు నా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ ప్రజలు వారి స్వంత దేశాలను విశాల పరచు కొనేందుకు వారి భూమిని తీసుకొన్నారు.


అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో: “దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు, కాని, వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.” అని వ్రాయబడి ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ