జెఫన్యా 1:7 - పవిత్ర బైబిల్7 నా ప్రభువైన యెహోవాముందు నిశ్శబ్దంగా ఉండు! ఎందుచేతనంటే, ప్రజలకు యెహోవా తీర్పు చెప్పే దినం త్వరలో వస్తుంది గనుక! యెహోవా తన బలిని సిద్ధం చేశాడు. తాను ఆహ్వానించిన అతిథులతో సిద్ధంగా ఉండమని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 యెహోవా దినం సమీపించింది. ఆయన బలి సిద్ధపరిచాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు. యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ప్రభువైన యెహోవా దినం సమీపించింది, కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. యెహోవా బలి సిద్ధం చేశారు; తాను ఆహ్వానించిన వారిని ఆయన పవిత్రపరిచారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ప్రభువైన యెహోవా దినం సమీపించింది, కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. యెహోవా బలి సిద్ధం చేశారు; తాను ఆహ్వానించిన వారిని ఆయన పవిత్రపరిచారు. အခန်းကိုကြည့်ပါ။ |
“కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు! ఆ సమయంలో ఆయన శత్రువులకు తగిన శిక్ష ఆయన విధిస్తాడు. యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది. దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది. ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది. ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.
ఒక బంధువు ఆ శవాన్ని బయటకు తీసికొనిపోయి దహనం చేయవచ్చు. ఆ బంధువు ఇంటినుంచి ఎముకలు తేవటానికి వెళ్తాడు. ఇంటిలో దాగిన ఏ వ్యక్తినైనా ప్రజలు పిలిచి, “నీ వద్ద ఇంకా ఏమైనా శవాలు మిగిలియా?” అని అడుగుతారు. ఆ వ్యక్తి, “లేవు …” అని సమాధానమిస్తాడు. అప్పుడా వ్యక్తియొక్క బంధువు ఇలా అంటాడు: “నిశ్శబ్దం! మనం యెహోవా మాట ఎత్తకూడదు.”