జెఫన్యా 1:4 - పవిత్ర బైబిల్4 ఈ సంగతులను యెహోవా చెప్పాడు: “యూదాను మరియు యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను శిక్షిస్తాను. ఆ స్థలంనుండి నేను వీటిని తీసివేస్తాను. బయలు దేవత పూజ చివరి గుర్తులను నేను తొలగించి వేస్తాను. నేను పూజారులను తొలగించి వేస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవతయొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 “నా హస్తాన్ని యూదా వారి మీద యెరూషలేము నివాసులందరి మీద చాపి, బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 “యూదా వారి మీద, యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 “యూదా వారి మీద, యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
బయలు దేవతలకు నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అందనంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను అతడు పగులగొట్టాడు. అతడా విగ్రహాలన్నిటినీ చూర్ణం చేశాడు. తరువాత యోషీయా ఆ చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు అర్పించిన వారి సమాధులపై చల్లాడు.