జెకర్యా 9:9 - పవిత్ర బైబిల్9 సీయోనూ, నీవు సంతోషంగా వుండు! యెరూషలేము ప్రజలారా, ఆనందంతో కేకలు పెట్టండి! చూడండి, మీరాజు మీ వద్దకు వస్తున్నాడు! ఆయన విజయం సాధించిన మంచి రాజు. కాని ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడిదపై స్వారీ చేస్తున్నాడు. ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 సీయోను నివాసులారా, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
నెగెవ్‌లో జంతువులను గూర్చి విచారకరమైన సందేశం: నెగెవ్ ప్రమాదకరమైన స్థలం. ఈ దేశంనిండా సింహాలు, సివంగులు, తాపకరమైన త్రాచుపాములు ఉంటాయి. కానీ కొంతమంది ప్రజలు నెగెవ్‌గుండా ప్రయాణం చేస్తున్నారు. వారు ఈజిప్టు వెళ్తున్నారు. ఆ మనుష్యులు వారి ధనాన్ని గాడిదల మీద వేశారు. ఆ మనుష్యులు వారి సంపదలను ఒంటెల మీదవేశారు. అంటే ఆ ప్రజలు సహాయం చేయలేని రాజ్యంమీద ఆధారపడుతున్నారని దీని అర్థం.
ఈ ప్రజలను నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి ఈ సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి.) “చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గూర్చి మీకు ఎవరు చెప్పారు? చాలాకాలం నుండి ఈ సంగతులను విడువక మీకు ఎవరు చెప్పారు? యెహోవాను నేనే, ఈ సంగతులు మీకు చెప్పాను. నేను ఒక్కడను మాత్రమే దేవుడను. నావంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకో మంచి దేవుడు ఉన్నాడా? తన ప్రజలను రక్షించే ఇంకో దేవుడూ ఉన్నాడా? లేడు మరి ఏ దేవుడు లేడు.
మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు శాశ్వతంగా జీవించేవాడు, పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు: “నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను. అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను. ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను. హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.