Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 9:3 - పవిత్ర బైబిల్

3 తూరు ఒక కోటలా కట్టబడింది. ఆ ప్రజలు వెండిని దుమ్మువలె విస్తారంగా సేకరించారు. బంగారం వారికి బంకమట్టివలె సామాన్యమై పోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 తూరు పట్టణం వారు ప్రాకారాలు గల కోట కట్టుకుని, ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారంగా బంగారాన్ని సమకూర్చుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 తూరు తన కోసం బలమైన దుర్గం కట్టుకుంది; ధూళి అంత విస్తారంగా వెండిని, వీధుల్లోని మట్టి అంత విస్తారంగా బంగారాన్ని పోగుచేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 తూరు తన కోసం బలమైన దుర్గం కట్టుకుంది; ధూళి అంత విస్తారంగా వెండిని, వీధుల్లోని మట్టి అంత విస్తారంగా బంగారాన్ని పోగుచేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 9:3
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీయుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా దేశపు దక్షిణ ప్రాంతాన గల బెయేర్షెబా చేరారు.


లెబానోను అరణ్యపు భవనంలో గిన్నెలు, పాన పాత్రలు, పనిముట్లు, ఆయుధాలు, అన్నీ శుద్ధ బంగారంతో చేయబడ్డాయి. భవనంలో ఏదీ వెండితో చేయబడలేదు. సొలొమోను కాలంలో బంగారం ఎంత విరివిగా లభించేదనగా ప్రజలు వెండిని విలువైన లోహంగా అసలు పరిగణించనేలేదు!


రాజు ఇశ్రాయేలును మిక్కిలి సంపన్న దేశంగా చేశాడు. యెరూషలేము నగరంలో వెండి రాతి గుట్టల్లా, దేవదారు చెక్కల్లా, కొండల్లో, కోనల్లో కాచే మేడి పండ్లలా అతి సామాన్యమై పోయింది.


నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి, ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు.


ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు. ఒకవేళ మట్టి పోగుల్లా అతనికి చాలా బట్టలు ఉండవచ్చును.


నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును. వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు!


యెహోవా సముద్రం మీద తన హస్తం చాపాడు. తూరుకు విరోధంగా యుద్ధం చేసేందుకు యెహోవా రాజ్యాలను సమకూరుస్తున్నాడు. తన భద్రతా స్థలం తూరును నాశనం చేయమని యెహోవా కనానుకు ఆదేశిస్తున్నాడు.


తూరు పట్టణం చాలామంది నాయకులను తయారు చేసింది. ఆ పట్టణపు వ్యాపారులు యువరాజుల్లా ఉన్నారు. క్రయ విక్రయ దారులు ఎక్కడ చూచినా గౌరవించబడ్డారు. కనుక తూరుకు వ్యతిరేకంగా పథకాలు వేసింది ఎవరు?


నెబుకద్నెజరు మనుష్యులు నీ ధనాన్ని దోచుకుంటారు. నీవు అమ్మ దలచిన వస్తువులను వారు ఎత్తుకుపోతారు. వారు నీ ప్రాకారాలను పడగొడతారు. నీ సుందర భవంతులను వారు నాశనం చేస్తారు. నీ రాళ్లను, కలప ఇండ్లను చెత్త వలె, సముద్రంలో పారవేస్తారు.


నీ ధనమంతా సముద్రం పాలవుతుంది. నీ ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, చుక్కాని పట్టేవారు, కీలుపెట్టి పడవలు బాగుచేసే పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో గల సైనికులు, నీ ఓడ సిబ్బంది అంతా సముద్రంలో మునిగిపోతారు! నీవు నాశనమయ్యే రోజున ఇదంతా జరుగుతుంది.


నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు. నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులతోను నీవనేక మందిని తృప్తిపర్చావు. ఈ భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!


కాని నీవు నడిసముద్రంలో, అగాధంలో ముక్కలై పోయావు. నీవు అమ్మే వస్తువులతో పాటు నీ మనుష్యులందరూ కూలిపోయారు!


యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు:


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలనందరినీ చెరబట్టి, వారిని బానిసలుగా ఎదోముకు పంపారు. తమ సోదరులతో (ఇశ్రాయేలుతో) చేసుకొన్న ఒడంబడికను వారు గుర్తు పెట్టుకోలేదు.


తర్వాత ఆ సరిహద్దు తిరిగి దక్షిణంగా రామాకు విస్తరించింది. ఆ సరిహద్దు బలమైన తుయర పట్టణంవరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు మళ్లుకొని హొసాకు పోయింది. సముద్రం దగ్గర అక్జీబు ప్రాంతంలో


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ