Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 9:17 - పవిత్ర బైబిల్

17 ప్రతీదీ మెచ్చదగినదై, అందంగా ఉంటుంది! విచిత్రమైన పంట పండుతుంది. కాని అది కేవలం ధాన్యం, ద్రాక్షారసం కాదు. ఆ పంట యువతీ యువకులే!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అది ఎంత రమ్యంగా మేలుగా ఉంటుంది! ధాన్యం చేత యువకులు, కొత్త ద్రాక్షారసం చేత కన్యలు పుష్టిగా ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 ధాన్యంతో యువకులు క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు. వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 ధాన్యంతో యువకులు క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు. వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 9:17
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.


నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు. యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.


యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది. నేను అడిగేది ఇదే: “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట. ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”


దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు. నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.


ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు. కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.


నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు! నీ పెదవులనుండి దయ వెలువడుతుంది కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.


సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.


ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు. నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.


ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు. సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.


మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము. మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.


“యెహోవా, నీలాంటి పరాక్రమముగల దేవుడు మరొకడు లేడు పరిశుద్ధతలో నీవు గొప్పవాడవు. స్తుతి కీర్తనలతో ఆరాధించబడుటకు యోగ్యుడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీకు సాటి వేరెవ్వరూ లేరు.


నా ప్రియుడు ఎర్రగా ప్రకాశించు శరీరం కలవాడు, తెల్లనివాడు. పదివేలలోనైన గుర్తింపుగలవాడు.


నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా, అది నిద్రించే వారి ప్రేమ పెదవులకు జాలువారేదిలా ఉంది.


రాజును (దేవుణ్ణి) ఆయన సంపూర్ణ సౌందర్యంలో మీరు చూస్తారు. ఆ మహా దేశాన్ని మీరు చూస్తారు.


యెహోవా, పరలోకము నుండి చూడుము. ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము. పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర నివాసంనుండి క్రిందనున్న మమ్మల్ని చూడుము. మా మీద నీ బలమైన ప్రేమ ఏది? నీ అంతరంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమైన కార్యాలు ఏవి? నామీద నీ కరుణ ఏది? నామీద నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు?


యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను. మరియు యెహోవాను స్తుతించటం నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇశ్రాయేలు వంశానికి యెహోవా అనేకమైన మంచివాటిని ఇచ్చాడు. యెహోవా మా యెడల చాలా దయచూపించాడు. యెహోవా మా యెడల కరుణ చూపించాడు.


ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు. వారు ఆనందంతో కేకలు వేస్తారు. యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. యెహోవా వారికి ఆహార ధాన్యాలను, క్రొత్త ద్రాక్షారసాన్ని, నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు. నీరు పుష్కలంగా లభించే ఒక తోటలా వారు విలసిల్లుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.


యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు!” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది!


అప్పుడు మీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మీరు తృప్తిగా ఉంటారు. మీ యెహోవా దేవుని నామం మీరు స్తుతిస్తారు. మీకోసం అయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నా ప్రజలు తిరిగి ఎన్నటికి సిగ్గుపరచబడరు.


“ఆ రోజున పర్వతాలనుండి తియ్యటి ద్రాక్షారసం కారుతుంది. కొండల్లో పాలు, తేనెలు ప్రవహిస్తాయి. మరియు యూదాలోని ఖాళీ నదులన్నిటిలో నీళ్ళు ప్రవహిస్తాయి. యెహోవా ఆలయంలోనుండి ఒక నీటి ఊట చిమ్ముతుంది. అది షిత్తీము లోయకు నీళ్ళు ఇస్తుంది.


ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము.


దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం.


పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది.


కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ