జెకర్యా 9:10 - పవిత్ర బైబిల్10 రాజు చెపుతున్నాడు, “నేను ఎఫ్రాయిములో రథాలనూ, యెరూషలేములో గుర్రవు రౌతులను నాశనం చేశాను. యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను.” శాంతిని గూర్చిన వార్తను అన్య దేశాలు విన్నాయి. ఆ రాజు సముద్రంనుండి సముద్రంవరకు పరిపాలిస్తాడు. ఆయన నదినుండి భూమిపై సుదూర ప్రాంతాలవరకు పాలిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములులేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను. యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోతుంది. నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను యుద్ధపు విల్లు విరిగిపోతుంది. ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు. ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు నది నుండి భూమి అంచుల వరకు ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను యుద్ధపు విల్లు విరిగిపోతుంది. ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు. ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు నది నుండి భూమి అంచుల వరకు ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయాధిపతిగా ఉంటాడు. అనేకుల వాదాలను దేవుడు అంతం చేస్తాడు. ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు. వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు. వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు. ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు. ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.
యెహోవా నాతో చెప్పాడు, “నీవు నాకు చాలా ప్రాముఖ్యమైన సేవకుడివి. ఇశ్రాయేలు ప్రజలు ఖైదీలు. వారు తిరిగి నా వద్దకు తీసుకొని రాబడతారు. అప్పుడు యాకోబు కుటుంబ దళాలు తిరిగి నా వద్దకు వస్తారు. అయితే నీకు మరో పని ఉంది; అది దీనికంటె ఇంకా ముఖ్యమయింది. సమస్త రాజ్యాలకు నిన్ను నేను వెలుగుగా చేస్తాను, భూమిమీద మనుష్యులందరినీ రక్షించేందుకు నీవే నా మార్గంగా ఉంటావు.”