Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 8:5 - పవిత్ర బైబిల్

5 వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఆ పట్టణం వీధులు ఆటలాడుకునే బాలబాలికలతో నిండి ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 పట్టణ వీధులు ఆటలాడే అబ్బాయిలతో అమ్మాయిలతో నిండిపోతాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 పట్టణ వీధులు ఆటలాడే అబ్బాయిలతో అమ్మాయిలతో నిండిపోతాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 8:5
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు. వారు ఆనందంతో కేకలు వేస్తారు. యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. యెహోవా వారికి ఆహార ధాన్యాలను, క్రొత్త ద్రాక్షారసాన్ని, నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు. నీరు పుష్కలంగా లభించే ఒక తోటలా వారు విలసిల్లుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.


ఇశ్రాయేలు యువతులంతా సంతోషంతో నాట్యం చేస్తారు. యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు. వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను. ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను!


“ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు అభివృద్ధి చెందేలా నేను సహాయపడే రోజులు వస్తున్నాయి.” ఇది యెహోవా వాక్కు. “వారి సంతానం, వారి పశుసంపద వర్థిల్లేలా కూడా నేను సహాయపడతాను. నేను చేసే ఆ పని ఒక మొక్కను నాటి దానిని పెంచినట్లుగా ఉంటుంది.


అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు.


లెమ్ము! రాత్రిళ్లు రోదించు! రాత్రిళ్లు ప్రతి ఝామున దుఃఖించు! ఒక జలరాశిలా నీ గుండె కుమ్మరించు! యెహోవా ముందు నీ గుండె కుమ్మరించు! నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయుము. నీ పిల్లలు బ్రతికేలా చేయుమని ఆయనను ప్రాధేయపడుము. ఆకలితో అలమటించి సొమ్మసిల్లే నీ పిల్లలను బతికించుమని ఆయనను అర్థించుము. ఆకలితో మాడి నగర వీధుల్లో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు.


అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవలేనంత పెద్దగా ఉంటుందని చెప్పు. అతనికి ఈ విషయాలు చెప్పు: ‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతువులు నివసిస్తాయి.’


ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి. కాని ఆ తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపుతాడు. ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవుతుంది. అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని పొందుతాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ