జెకర్యా 8:23 - పవిత్ర బైబిల్23 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా మనిషి వద్దకు వచ్చి, ‘దేవుడు నీతో ఉన్నాడని మేము విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో రావచ్చునా?’ అని అడుగుతారు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని–దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే ఆ దినాల్లో వివిధ భాషలు మాట్లాడే అన్యప్రజల్లో పదేసిమంది ఒక యూదుడి చెంగు పట్టుకుని “దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడింది గనక మేము మీతో కూడా వస్తాము” అని చెబుతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.” အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు దేవుని ఆత్మ అమాశై మీదికి వచ్చింది. అమాశై ముప్పదిమంది వీరుల నాయకుడు. అమాశై అప్పుడు ఇలా అన్నాడు: “ఓ దావీదూ, మేము నీవారం! ఓ యెష్షయి కుమారుడా, మేము నీతో వున్నాము. శాంతి! నీకు శాంతి కలుగుగాక! నీకు సహాయపడే ప్రజలకు కూడ శాంతి. ఎందువల్లననగా నీ దైవం నీకు సహాయపడుతున్నాడు!” అప్పుడు దావీదు వారికి స్వాగతం పలికి వారిని చేరదీశాడు. తన పక్షాన వారిని దళాధిపతులుగా నియమించాడు.
యెహోవా చెబుతున్నాడు, “ఈజిప్టులో, ఇథియోపియాలో ఎన్నో సంగతులు చేయబడ్డాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వాటిని పొందుతారు. ఆజానుబాహులైన సెబా ప్రజలు మీ వాళ్లవుతారు. వారు మెడలలో సంకెళ్లతో మీ వెనుక నడుస్తారు. వాళ్లు మీ ఎదుట సాష్టంగపడతారు. వాళ్లు మీకు విన్నపం చేసుకొంటారు.” ఇశ్రాయేలూ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరి ఇంకే దేవుడూ లేడు.