జెకర్యా 7:13 - పవిత్ర బైబిల్13 కావున సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు, “నేను వారిని పిలిచాను, కాని వారు పలకలేదు. అందువల్ల ఇప్పుడు వారు పిలిస్తే నేను పలకను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచి నప్పుడు నేను ఆలకింపను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 కనుక సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “నేను పిలిచినప్పుడు వారు ఆలకించ లేదు గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “ ‘నేను పిలిచినప్పుడు, వారు వినలేదు; కాబట్టి వారు పిలిచినప్పుడు నేను వినను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “ ‘నేను పిలిచినప్పుడు, వారు వినలేదు; కాబట్టి వారు పిలిచినప్పుడు నేను వినను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
నేను ఇంటికి వచ్చాను, ఎవరూ కనబడలేదు. నేను పిలిచి, పిలిచి, ఎంత పిలిచినా ఎవరూ పలుక లేదు. నేను మిమ్మల్ని రక్షించలేనని మీరు తలుస్తున్నారా? మీ కష్టాలనుండి మిమ్మును రక్షించే శక్తినాకు ఉంది. చూడండి, సముద్రాన్ని ఎండి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తే అది ఎండిపోతుంది! అక్కడ నీళ్లు ఉండవు గనుక చేపలు చస్తాయి, అవి కుళ్లిపోతాయి.
యూదా ప్రజలు ఉపవాసాలు మొదలుపెట్టి నన్ను ప్రార్థించవచ్చు. కాని నేను వారి ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసుకుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పైగా వారిని భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.”
“నరపుత్రుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి కారణమైన వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు!