జెకర్యా 5:3 - పవిత్ర బైబిల్3 అప్పుడు దేవదూత నాతో చెప్పాడు, “ఆ చుట్టబడిన పత్రంమీద ఒక శాపం వ్రాయబడి ఉంది. ఆ పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. ఆ పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసేవారికి ఒక శాపం ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 అందుకతడు నాతో ఇట్లనెను–ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అప్పుడు అతడు నాతో “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం. దానికి ఒక వైపు రాసి ఉన్న ప్రకారం దొంగతనం చేసేవాళ్ళు నాశనం అవుతారు, రెండవ వైపు రాసి ఉన్న ప్రకారం అబద్ద సాక్ష్యాలు పలికేవాళ్ళంతా నాశనం అవుతారు” అని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అందుకతడు నాతో ఇలా అన్నాడు, “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం; దానికి ఒకవైపు వ్రాసి ఉన్న ప్రకారం దొంగలు నాశనమవుతారు, రెండవ వైపు వ్రాసి ఉన్న ప్రకారం అబద్ధ ప్రమాణం చేసేవారంతా దేశ బహిష్కరణ శిక్ష పొందుతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అందుకతడు నాతో ఇలా అన్నాడు, “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం; దానికి ఒకవైపు వ్రాసి ఉన్న ప్రకారం దొంగలు నాశనమవుతారు, రెండవ వైపు వ్రాసి ఉన్న ప్రకారం అబద్ధ ప్రమాణం చేసేవారంతా దేశ బహిష్కరణ శిక్ష పొందుతారు. အခန်းကိုကြည့်ပါ။ |
యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది. వారనేక విధాలుగా అవిశ్వాసులై ఉన్నారు. యెహోవా రాజ్యాన్ని శపించాడు. అందుచే అది బీడై పోయింది. పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి. పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి. ప్రవక్తలంతా దుష్టులయ్యారు. ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.
అప్పడు నేను మీ దగ్గరకు వస్తాను. మరియు సరైనది నేను చేస్తాను. ప్రజలు చేసిన చెడుకార్యాలను గూర్చి న్యాయమూర్తితో చెప్పటానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంతమంది మాయమంత్రాలు చేస్తారు. కొంతమంది వ్యభిచార పాపం చేస్తారు. కొంతమంది బూటకపు వాగ్దానాలు చేస్తారు. కొంతమంది తమ పనివారిని మోసం చేస్తారు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు చెల్లించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.