జెకర్యా 10:2 - పవిత్ర బైబిల్2 భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రజలు తమ చిన్న విగ్రహాలను, మంత్రతంత్రాలను ఉపయోగిస్తారు. కాని అది నిరుపయోగం. ఆ జనులు దర్శనాలు చూసి, తమ కలలను వివరిస్తారు. కాని అవన్నీ పనికిరాని అబద్ధాలు. అందువల్ల ప్రజలు సహాయంకొరకు గొర్రెల్లా అరుస్తూ ఇక్కడా, అక్కడా తిరుగుతారు. కాని వారిని నడిపించటానికి కాపరిలేడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱెలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదె చెప్పేవాళ్ళకు వ్యర్ధమైన కలలు వచ్చాయి. వాళ్ళు కపటంతో ఆ కలలకు అర్థం చెప్పారు. మోసపూరిత భావాలు చెప్పి ఓదార్చారు. కాబట్టి ప్రజలు గొర్రెల మంద తిరిగినట్టు తిరిగారు. తమను కాచే కాపరి లేకపోవడం వల్ల బాధల పాలయ్యారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 గృహదేవతలు మోసపు మాటలు మాట్లాడతాయి, సోదె చెప్పేవారు అబద్ధపు దర్శనాలు చూస్తారు; వారు మోసంతో కలల భావాలు చెప్తారు, వ్యర్థమైన ఓదార్పు ఇస్తారు. కాబట్టి కాపరి లేకపోవడం వలన బాధించబడిన గొర్రెలు తిరిగినట్లు ప్రజలు తిరుగుతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 గృహదేవతలు మోసపు మాటలు మాట్లాడతాయి, సోదె చెప్పేవారు అబద్ధపు దర్శనాలు చూస్తారు; వారు మోసంతో కలల భావాలు చెప్తారు, వ్యర్థమైన ఓదార్పు ఇస్తారు. కాబట్టి కాపరి లేకపోవడం వలన బాధించబడిన గొర్రెలు తిరిగినట్లు ప్రజలు తిరుగుతారు. အခန်းကိုကြည့်ပါ။ |
అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు.
కావున మీరు మీ ప్రవక్తలు చెప్పే దానిని వినవద్దు. మంత్ర విద్యచే మోసం చేసి భవిష్యత్తును చెప్పజూచే వారి మాయలో పడవద్దు. కలల ఆంతర్యాలను చెపుతామనే వారి మాటలు నమ్మవద్దు. చనిపోయిన వారితో మాట్లాడుతామనేవారు, కనికట్టు విద్యలను ఆచరించే వారు చెప్పే మాటలు వినవద్దు. ఆ మనుష్యులు, “మీరు బబులోను రాజుకు బానిసలు కానేరరు” అని చెపుతారు.
ఇది బబులోను రాజు ఆ ప్రాంతాన్ని తాను ఎలా ఎదుర్కోవాలన్నదానిని తెలుపుతుంది. బబులోను రాజు ఆ మార్గం రెండుగా విడిపోయే చోటికి వచ్చాడు. బబులోను రాజు తన భవిష్యత్తు కార్యక్రమం తెలుసుకొనటానికి మంత్ర, తంత్ర సంకేతాలను ఉపయోగించాడు. అతడు కొన్ని బాణాలు తీసుకొన్నాడు. తన కులదేవతలను కొన్ని ప్రశ్నలడిగాడు. పిమ్మట అతడు చంపిన ఒక జంతువు కార్జంవెపు చూశాడు.