జెకర్యా 1:3 - పవిత్ర బైబిల్3 కావున ప్రజలకు నీవు ఈ విషయాలు తప్పక చెప్పాలి. “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను” అని సర్వశక్తి మంతుడైన యెహోవా చెపుతున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 కాబట్టి నీవు వారితో ఇట్లనుము –సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 కాబట్టి నీవు ఈ ప్రజలతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను’ అని సైన్యాల యెహోవా అంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 కాబట్టి నీవు ఈ ప్రజలతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను’ అని సైన్యాల యెహోవా అంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
“ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే, ఆ వ్యక్తి మళ్లీ ఆమెవద్దకు తిరిగి రాగలడా? లేదు. రాలేడు! ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా ‘మాలిన్య’ మైపోతుంది. యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు. మరల నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావా?” అని యెహోవా పలికాడు.
ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీ వద్దకు నా సేవకులగు ప్రవక్తలను పంపాను. వారిని అనేక పర్యాయాలు మీ వద్దకు పంపినాను. ఆ ప్రవక్తలు మీతో, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీలో ప్రతి ఒక్కడు చెడు కార్యాలు చేయటం మానివేయాలి. మంచి చెయ్యండి, ఇతర దేవతలను వెంబడించవద్దు, పూజించవద్దు, మీరు నాకు విధేయులై, మీ పూర్వీకులకు, మీకు నేను ఇచ్చిన భూమియందు మీరు నివసించవచ్చు’ అని అన్నాను. కాని మీరు నా మాటను వినుటకు తిరస్కరించారు.
“నీవు వారితో ఇలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా జీవం తోడుగా ప్రజలు చనిపోతూ ఉంటే చూడటం నాకు ఇష్టముండదని మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. ఆ దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందువల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం మానండి! ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు మరణించాలి?’