Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 6:2 - పవిత్ర బైబిల్

2 సుగంధ పుష్పాల ఉద్యాన వనానికి నా ప్రియుడు వెళ్లాడు. తన సుగంధాలు వెదజల్లు పూలమొక్కల తోటకు గొర్రెలు మేపడానికి వెళ్లాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) మేపడానికీ లిల్లీలు ఏరడానికీ నా ప్రియుడు తన తోటలోకి వెళ్ళాడు. సుగంధ వనస్పతులున్న తోటలోకి వెళ్ళాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 నా ప్రియుడు తన తోటకు వెళ్లాడు, పరిమళ మొక్కల పాన్పుల దగ్గరకు, తోటలో మందను మేపడానికి, తామరలను ఏరుకోడానికి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 నా ప్రియుడు తన తోటకు వెళ్లాడు, పరిమళ మొక్కల పాన్పుల దగ్గరకు, తోటలో మందను మేపడానికి, తామరలను ఏరుకోడానికి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 6:2
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా ప్రియుడు నావాడు, నేను అతని దానను! అతడు సుగంధ పుష్పాల పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!


నా నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నిష్కళంకురాలివి. మూయబడిన ఉద్యానవనం వలె, మూయబడిన జలాశయంవలె, మూయబడిన జలధారలవలె స్వచ్ఛమైనదానవు.


ఉత్తర పవనమా లే! దక్షిణ పవనమా రా! నా ఉద్యానవనంపై వీచి, దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి అందలి మధుర ఫలాలు ఆరగించాలి.


నీ స్తనాలు, తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి.


నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను, నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను, తేనె త్రాగాను. తేనె పట్టును తిన్నాను నేను నా ద్రాక్షాక్షీరాలు సేవించాను. ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, త్రాగండి! ప్రేమను త్రాగి మత్తిల్లండి!


అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల పరిమళ పుష్పరాశులవలెను, అతని పెదవులు అత్తరువారి బోళంతో తడిసిన కెందామరలు (ఎర్ర తామరలు).


నేను బాదం తోపుకి వెళ్లాను ఫలసాయమెలా ఉందో చూసేందుకు ద్రాక్షా తీగెలు పూశాయేమో చూసేందుకు దానిమ్మలు మొగ్గతొడిగాయేమో చూసేందుకు,


గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు. యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు. గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”


మంచి మనుష్యులు పోయారు. కానీ ఏ వ్యక్తి అది గమనించలేదు. ఏం జరుగుతుందో ప్రజలు గ్రహించరు. కానీ వారు మంచి మనుష్యులందరిని సమావేశపరచారు. కష్టాలు వస్తున్నాయని ప్రజలు గ్రహించరు. మంచి వాళ్లంతా భద్రతకోసం సమావేశం చేయబడ్డారని వారికి తెలియదు.


అప్పుడు యెహోవా మిమ్మల్ని సదా నడిపిస్తాడు. ఎండిన భూములలో ఆయన మీ ఆత్మకు సంతృప్తినిస్తాడు. మీ ఎముకలకు యెహోవా బలం ఇస్తాడు. విస్తారమైన నీళ్లుగల తోటలా మీరు ఉంటారు. ఎల్లప్పుడు నీళ్లు ఉబుకుతూ ఉండే ఊటలా మీరుంటారు.


భూమి మొక్కలను మొలిపిస్తుంది. ప్రజలు తోటలో విత్తనాలు చల్లుతారు. ఆ తోట ఆ విత్తనాలను ఎదిగింపజేస్తుంది. అదే విధంగా యెహోవా దయను ఎదిగింప జేస్తాడు. సకల రాజ్యాలలో యెహోవా స్తుతిని ఎదిగింప జేస్తాడు.


తరువాత నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని మేపుతాడు. అతడు వాటిని స్వయంగా మేపి, వాటికి కాపరి అవుతాడు.


నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు. ఆయన నీగురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు. విందులో పాల్గొన్నవారివలె ఆయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.


ఎందుకంటే, నా పేరిట యిద్దరు లేక ముగ్గురు ఎక్కడ సమావేశమైతే నేను అక్కడ వాళ్ళతో ఉంటాను.”


నేను మీకాజ్ఞాపించిన వన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను” అని అన్నాడు.


నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం.


“తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష.


సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ