Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 5:7 - పవిత్ర బైబిల్

7 నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు నన్ను కొట్టి, గాయపరిచారు. ప్రాకారం కావలివారు నా పైవస్త్రాన్ని కాజేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు. వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు. ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకెదురై వారు నన్ను కొట్టి, గాయపరిచారు; నా ముసుగును తొలగించారు, వారు ప్రాకారం మీద కావలివారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకెదురై వారు నన్ను కొట్టి, గాయపరిచారు; నా ముసుగును తొలగించారు, వారు ప్రాకారం మీద కావలివారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 5:7
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు. అది నాకు మంచిదే. వారి విమర్శను నేను అంగీకరిస్తాను. నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.


నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు. వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?” అని.


నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను, కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు! అతడు వెళ్లిపోయినంతనే నా ప్రాణం కడగట్టింది. నేనతని కోసం గాలించాను. కాని అతడు కనిపించలేదు. నేనతన్ని పిలిచాను, కాని అతడు బదులీయలేదు.


యెరూషలేము స్త్రీలారా, నా ప్రియుడు మీ కంట పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ ప్రేమతో కృంగి కృశించి పోతోందని.


బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది. ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు. వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు ఇచ్చాడు.


అద్దాలు, మేలిమి వస్త్రాలు, తలపాగాలు, శాలువాలు.


కావలి ఉండుటకు యెరూషలేము గోడల మీద కావలివారిని (ప్రవక్తలను) నేను ఉంచుతాను. ఈ కావలివారు మౌనంగా ఉండరు. రాత్రింబవళ్లు వారు కనిపెట్టి ఉంటారు. యెహోవాను గూర్చి ఉపదేశించే మీరు ఎన్నటికీ మౌనంగా ఉండకూడదు. యెహోవాను ప్రార్థించటం మీరు చాలించకూడదు.


నేను ప్రవక్తలను ఉపయోగించి ప్రజల కోసం న్యాయచట్టం చేశాను. నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు. కాని, ఆ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.


“శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు.


“మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు!


వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది.


అలాంటివాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్తలుల వలే నటిస్తారు.


ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన వాణ్ణి. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో నేను ఒక్క తప్పు కూడా చేయలేదు.


మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ