సొలొమోను ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనేక వృక్షజాతులను గూర్చి చెప్పాడు. లెబానోనులోని గొప్ప దేవదారు వృక్షములనుండి, గోడలలో పుట్టి పాకే లతజాతుల మొక్కల వరకు అతనికి తెలుసు. రాజైన సొలొమోను జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, పాములు తదితర పాకే క్రిమికీటకాదులు, బల్లులు, చేపలు మొదలగు వాటిని గూర్చి కూడా చెప్పాడు.
నీ మెడ దంతపు గోపురంలా ఉంది నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న హెష్బోనులోని రెండు తటాకాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే లెబానోను శిఖరంలా ఉంది.
దేవుని సేవకు ప్రత్యేకంగా అంకితమైన యూదా మనుష్యులు మంచుకంటె తెల్లనివారు. వారు పాలకంటె తెల్లనివారు. వారి శరీరాలు పగడంలా ఎర్రనివి. వారి దేహకాంతి నీలమువంటిది.
నేనే దానిని ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతంపై నాటుతాను. ఆ కొమ్మ ఒక వృక్షంలా పెరుగుతుంది. అది బాగా కొమ్మలు వేసి, పండ్లు కాస్తుంది. అది ఒక అందమైన దేవదారు వృక్షమవుతుంది. దాని కొమ్మలపై అనేకమైన పక్షులు కూర్చుంటాయి. అనేకమైన పక్షులు దాని కొమ్మల నీడల్లో నివసిస్తాయి.
దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు. దీనికి ఉన్నన్ని కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు. అక్షోట (మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు. దేవుని ఉద్యానవనంలో ఇంత అందమైన చెట్టేలేదు.
ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది. క్రీస్తు మానవ రూపం ఎత్తాడు. పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు. దేవదూతలు ఆయన్ని చూసారు. రక్షకుడని ఆయన గురించి జనాంగములకు ప్రకటింపబడింది. ప్రజలు ఆయన్ని విశ్వసించారు. ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు.
తర్వాత ఆమె తన భర్త వద్దకు వెళ్లి అతనితో జరిగిన విషయం చెప్పింది. ఆమె ఇలా చెప్పింది: “దేవుని వద్దనుండి ఒక మనిషి నా వద్దకు వచ్చాడు. అతను దేవదూతగా కనిపించాడు. అతను నన్ను భయపెట్టాడు. ఎక్కడినుంచి అతను వచ్చాడో, ఆ సంగతి నేను కనుక్కోలేదు. అతను తన పేరు చెప్పలేదు.