పరమగీతము 5:1 - పవిత్ర బైబిల్1 నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను, నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను, తేనె త్రాగాను. తేనె పట్టును తిన్నాను నేను నా ద్రాక్షాక్షీరాలు సేవించాను. ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, త్రాగండి! ప్రేమను త్రాగి మత్తిల్లండి! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానముచేయుచున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు). నా సోదరీ, చెలీ, నేను నా తోటలోకి వచ్చాను. నా జటామాంసిని నా సుగంధాలతో తెచ్చుకున్నాను. తేనె, తేనెపట్టుతో తిన్నాను. నా ద్రాక్షారసాన్ని నా పాలతో తాగాను. నేస్తమా, తిను. నేస్తం, తిను. ప్రియా, బాగా తాగు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను; నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను. నేను తేనెతెట్టె తేనె తిన్నాను; నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను. స్నేహితులారా, తినండి త్రాగండి; ప్రేమికులారా! తృప్తిగా సేవించండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను; నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను. నేను తేనెతెట్టె తేనె తిన్నాను; నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను. స్నేహితులారా, తినండి త్రాగండి; ప్రేమికులారా! తృప్తిగా సేవించండి. အခန်းကိုကြည့်ပါ။ |
అదే విధంగా సీయోనును యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు.