Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 1:15 - పవిత్ర బైబిల్

15 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు! నీ కళ్లు పావురపు కళ్లలా వున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 (ఆమె ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు) ప్రేయసీ, నువ్వు సుందరివి. చాలా అందంగా ఉన్నావు. నీ కళ్ళు అచ్చం గువ్వ కళ్ళే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! ఓ, ఎంతో అందాలరాశివి! నీ కళ్లు గువ్వలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! ఓ, ఎంతో అందాలరాశివి! నీ కళ్లు గువ్వలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 1:15
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు! అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు! మన శయ్య ఆకుపచ్చగా ఆహ్లాదంగా ఉంది


నీవు అంత అందమైనదానవు! కనుక నిజంగా నీకు తెలుసు ఏమి చెయ్యాలో. వెళ్లు, గొర్రెలను వెంబడించు. నీ చిన్న మేకల్ని కాపరుల గుడారాల వద్ద మేపు.


నా ప్రియురాలా, ఫరో రథాలు లాగుతున్న నా ఆడ గుర్రాలతో నిన్నుపోల్చియున్నాను.


నా ప్రియుడు నాతో అంటున్నాడు, “నా ప్రియురాలా, లెమ్ము, నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!


అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు. నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా, మనం వెళ్లిపోదాం!”


నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఆహా, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి ముసుగు క్రింద నీ కళ్లు పావురాల కళ్లలా ఉన్నాయి. నీ శిరోజాలు పొడుగ్గా గిలాదు పర్వత సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా జారుతున్నాయి.


నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీ ప్రేమ చాలా సుందరమైనది ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ మధురమైంది, నీ పరిమళ ద్రవ్యపు సువాసన ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది!


నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది. నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!


అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరే పావురాలకళ్లలాంటివి. పాల మునిగిన పావురాలవలెను, బంగారంలో పొదిగిన రత్నాల వలెను,


నేను నిద్రించానేగాని నా హృదయం మేల్కొనేవుంది. నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను “నా ప్రియ సఖీ, ప్రేయసీ, నా పావురమా, పరిపూర్ణవతీ! తలుపు తెఱువు. నా తల మంచుతో తడిసింది నా జుట్టు రేమంచు జడికి నానింది.”


ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. చంద్రబింబమంత అందమైనది సూర్యుడంత ధగ ధగలాడుతోంది, పరలోక సేనలంతటి విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు?


ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా నగరమంత సుందర మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైనదానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి.


నీవు అతీత సుందరివి! అత్యంత మనోహరివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!


నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి.


“మా కానుకలను యెహోవా ఎందుచేత అంగీకరించలేదు?” అని మీరు అడుగుతారు. ఎందుకంటే మీరు చేసిన చెడుకార్యాలు యెహోవా చూశాడు, మీకు విరుద్ధంగా ఆయనే సాక్షి. నీవు నీ భార్యను మోసం చేయటం ఆయన చూశాడు. నీవు యువకునిగా ఉన్నప్పుడే నీవు ఆ స్త్రీకి వివాహం చేయబడ్డావు. ఆమె నీ స్నేహితురాలు. తర్వాత మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసికొన్నారు. ఆమె నీకు భార్య అయింది. కానీ నీవు ఆమెను మోసం చేసావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ