Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రూతు 1:21 - పవిత్ర బైబిల్

21 నేను వెళ్లినప్పుడు నాకు కావాల్సింది అంతా ఉండేది. కాని, దేవుడు ఇప్పుడు నన్నుఏమీ లేనిదానిగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన నన్ను దుఃఖమయినిగా చేస్తే, మీరు నన్ను సంతోషం అని పిలవడం దేనికి? సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను చాలా బాధపెట్టాడు” అని నయోమి వారితో అన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 నేను సమృద్ధిగలదాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అనిపిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 నేను బాగా ఉన్న స్థితిలో ఇక్కడినుండి వెళ్ళాను. యెహోవా నన్ను ఖాళీ చేతులతో తిరిగి తీసుకువచ్చాడు. యెహోవా నాకు వ్యతిరేక సాక్షిగా నిలిచాడు. సర్వ శక్తిశాలి నన్ను బాధ పెట్టాడు. ఇదంతా చూసి కూడా నన్ను నయోమి అని పిలుస్తారెందుకు?” అని వారితో అంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 నేను సమృద్ధి కలదానిగా వెళ్లాను, అయితే యెహోవా నన్ను ఏమి లేనిదానిగా తీసుకువచ్చారు. ఎందుకు నన్ను నయోమి అని పిలుస్తారు? యెహోవా నాకు శ్రమ కలుగజేశారు; సర్వశక్తుడు నాకు బాధ కలిగించారు” అన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 నేను సమృద్ధి కలదానిగా వెళ్లాను, అయితే యెహోవా నన్ను ఏమి లేనిదానిగా తీసుకువచ్చారు. ఎందుకు నన్ను నయోమి అని పిలుస్తారు? యెహోవా నాకు శ్రమ కలుగజేశారు; సర్వశక్తుడు నాకు బాధ కలిగించారు” అన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రూతు 1:21
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు ఇలా చెప్పాడు: “నేను ఈ లోకంలో పుట్టినప్పుడు నేను దిగంబరిని, నాకు ఏమీ లేదు. నేను మరణించి లోకాన్ని విడిచి పెట్టేటప్పుడు నేను దిగంబరినిగా ఉంటాను. నాకు ఏమీ ఉండదు. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామాన్ని స్తుతించండి!”


నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు నీకు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. నామీద నీ కోపం ఎక్కువ అవుతుంది. నీవు నా మీదికి కొత్త సైన్యాలను పంపిస్తావు.


దేవా, నా మీద నీవు కఠినమైన మాటలు పలుకుతున్నావు. నేను యువకునిగా ఉన్నప్పుడు చేసిన పాపాలకు నీవు నన్ను శ్రమ పెడుతున్నావు.


నీవు నన్ను కట్టివేశావు. అది ప్రతి ఒక్కరూ చూడగలరు. నా శరీరం రోగంతో ఉంది, నేను భయంకరంగా కనబడుతున్నాను. దాని అర్థం నేను దోషిని అని ప్రజలు తలస్తున్నారు.


నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బలహీనుణ్ణి చేశాడు. ఆ యువకులు తమని తాము వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా తిరుగుతారు.


అప్పడు నేను మీ దగ్గరకు వస్తాను. మరియు సరైనది నేను చేస్తాను. ప్రజలు చేసిన చెడుకార్యాలను గూర్చి న్యాయమూర్తితో చెప్పటానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంతమంది మాయమంత్రాలు చేస్తారు. కొంతమంది వ్యభిచార పాపం చేస్తారు. కొంతమంది బూటకపు వాగ్దానాలు చేస్తారు. కొంతమంది తమ పనివారిని మోసం చేస్తారు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు చెల్లించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


మీరు వారిని పెండ్లాడాలంటే వాళ్లు పెద్ద వాళ్లయ్యేంతవరకు మీరు వాళ్లకోసం వేచి ఉండాలి. అన్నాళ్లూ మీరు పెళ్లి చేసుకోకుండా ఆపుజేయడం నాకు మరీ విచారం. ఎందుకంటే, యెహోవా హస్తము నాకు విరోధముగా ఎన్నో పనులు చేసింది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ