1 సోదరులారా! నేను ధర్మశాస్త్రం తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రానికి ఒక వ్యక్తిపై అతడు బ్రతికి ఉన్నంతవరకే అధికారం కలిగి ఉంటుందని మీకు తెలియదా?
1 సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారితో నేను మాట్లాతున్నాను. ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రానికి అతనిపై అధికారం ఉంటుందని మీకు తెలుసా?
1 సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారితో నేను మాట్లాతున్నాను. ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రానికి అతనిపై అధికారం ఉంటుందని మీకు తెలుసా?
1 సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారితో నేను మాట్లాతున్నాను, ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రానికి అతనిపై అధికారం ఉంటుందని మీకు తెలుసా?
ఎజ్రా, మీ దేవుని యొద్ద నుంచి నీవు పొందిన వివేకాన్ని వినియోగించి పౌర, మతపర న్యాయాధిపతులను ఎంపికచేసే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి వారు తెలియని వారికి నేర్పాలి.
సోదరులారా! నేను, మిగతా యూదులుకానివాళ్ళనుండి ఫలం పొందినట్లే మీనుండి కూడా ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి. ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక.
మనల్ని బంధించి ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్ఛను పొందాము. అందువల్ల వ్రాత పూర్వకంగా ఉన్న ధర్మశాస్త్రానికి మనమిక బానిసలము కాము. దేవుని ఆత్మ చూపించిన క్రొత్త మార్గాన్ని అనుసరించి మనము ఆయన సేవ చేస్తున్నాము.