Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 18:3 - పవిత్ర బైబిల్

3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి. దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి. భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతోకూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

3 ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్ని మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 18:3
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు కష్టపడి సంపాదించిన దానంతటికీ అలా జరుగుతుంది. నీవు చిన్న పిల్లగా ఉన్నప్పట్నుంచీ నీతో వ్యాపారం చేసిన వారు నిన్ను వదిలివేస్తారు ప్రతివాడూ వాని వాని దారిన పోతాడు. నిన్ను రక్షించేందుకు ఒక్క మనిషి కూడా ఉండడు.”


“గతంలో బబులోను రాజు నెబుకద్నెజరు మమ్మల్ని నాశనం చేశాడు. గతంలో నెబుకద్నెజరు మమ్మల్ని గాయపర్చాడు. ఇదివరలో అతడు మా ప్రజలను చెరగొన్నాడు. మేము వట్టి జాడీల్లా అయ్యాము. అతడు మాకున్న మంచి వస్తువులన్నిటినీ తీసికొన్నాడు. కడుపు పగిలేలా అన్నీ తిన్న పెద్దరాక్షసిలా అతడున్నాడు. అతడు మా మంచి వస్తువులన్నీ తీసికొని మమ్మల్ని నెట్టివేశాడు.


యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను ఉండేది. బబులోను ప్రపంచాన్నంతటినీ తాగించింది. బబులోను ఇచ్చిన మధ్యాన్ని దేశాలు సేవించాయి. కావున వారికి వెర్రి పట్టింది.


ఒకనాడు విలువైన భోజనం చేసినవారు, ఈనాడు వీధుల్లో చనిపోతున్నారు. అందమైన ఎర్రని దుస్తుల్లో పెరిగిన ప్రజలు ఇప్పుడు చెత్త కుండీలలో ఏరుకుంటున్నారు.


నీనెవె మూలంగా ఇవన్నీ జరిగాయి. తృప్తి చెందని వేశ్యలా నీనెవె ఉంది. ఆమె మరింతమందిని కోరుకుంది. తనను తాను అనేక జనులకు అమ్ముకుంది. వారిని తన బానిసలుగా చేసుకోటానికి ఆమె తన మంత్ర విద్యలను ఉపయోగించింది.


ఏమి చూడాలని వెళ్ళారు? విలువైన వస్త్రాల్ని ధరించిన వాళ్ళనా? విలువైన వస్త్రాలను ధరించేవారు రాజగృహాల్లో ఉంటారు.


చిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు.


రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, “బాబిలోను పతనమైపోయింది. బాబిలోను మహానగరం పతనమైపోయింది. ‘వ్యభిచారం’ అనబడే మద్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే” అని అన్నాడు.


దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు.”


వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ, ‘అయ్యో! అయ్యో! మహానగరమా! సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే! ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు.


దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు. కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు. నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు. నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి.


ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి. అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను. నేను ఎన్నటికీ వితంతువును కాను. నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.


“దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ