Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 12:15 - పవిత్ర బైబిల్

15 ఆ సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 కాబట్టి ఆ స్త్రీ నీళ్ళలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అప్పుడు, ఆ స్త్రీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదిలా కుమ్మరించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అప్పుడు, ఆ స్త్రీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదిలా కుమ్మరించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

15 అప్పుడు, ఆ స్త్రీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదిలా కుమ్మరించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 12:15
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది, కపటమైనది. ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకొని, “ఏమమ్మా! ఈ తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినవద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా?” అంది.


నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు. మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి. మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి. నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయపెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.


ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు. మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.


చూడు, బలమూ, ధైర్యమూ గల ఒకడు నా ప్రభువు దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి వడగండ్ల వర్షపు తుఫానులా దేశంలోనికి వస్తాడు. తుఫాను వచ్చినట్టు ఆయన దేశంలోనికి వస్తాడు. దేశాన్ని వరదలో ముంచెత్తే బలమైన నీటి ప్రవాహంలా ఆయన ఉంటాడు. ఆ కిరీటాన్ని (సమరయ) ఆయన నేలకేసి కొడ్తాడు.


అప్పుడు పశ్చిమాన ప్రజలు యెహోవా నామాన్ని గౌరవిస్తారు. తూర్పున ప్రజలు యెహోవా మహిమను గూర్చి భయపడతారు. వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా వెంటనే వస్తాడు. యెహోవా ఈ నదిమీద విసరగా వచ్చిన శక్తివంతమైన గాలిలా అది ఉంటుంది.


అందుచేత చూడు, నా యెహోవా మహా గొప్ప యూఫ్రటీసు నదీ ప్రవాహంలాగా అష్షూరును దాని శక్తి అంతటిని తీసుకొని వస్తున్నాడు. వారు ఒక నది పొంగి పొర్లేలా, ప్రవాహంలా మీ దేశంలోనికి వస్తారు.


సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం.


కాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది.


వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.


ఆ తర్వాత దూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవు ఆ వేశ్య కూర్చున్న నీళ్ళను చూసావు. ఆ నీళ్ళు ప్రజల గుంపుల్ని, జాతుల్ని, దేశాలను, భాషలను సూచిస్తోంది.


అతడు ఘటసర్పాన్ని పట్టుకొని వెయ్యి ఏండ్లదాకా బంధించి వేసాడు. దీన్ని ఆది సర్పమని, దయ్యమని, సాతానని అంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ