Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 9:6 - పవిత్ర బైబిల్

6 శత్రువు పని అంతం అయిపోయింది. యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు. ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండ బొత్తిగా నశించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అంతులేని పతనం నా శత్రువులు పతనమై పూర్తిగా నశిస్తారు, మీరు వారి పట్టణాలను పెల్లగించారు; వాటి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అంతులేని పతనం నా శత్రువులు పతనమై పూర్తిగా నశిస్తారు, మీరు వారి పట్టణాలను పెల్లగించారు; వాటి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 9:6
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ దేశము మీదుగా నడిచాను అదే నీవు చెప్పింది, కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా? నేను (దేవుడు) పూర్వమే పథకము వేశాను ప్రాచీన కాలం నుండి పథకం వేశాను ఇప్పుడది జరుగునట్లు చేశాను బలిష్ఠమైన ఆ నగరాలు నాశనము చేయుటకును రాతి కుప్పలుగా మార్చుటకును నిన్ను అనుమతించాను.


భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు. ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోడు.


కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు. ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.


ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు. ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.


భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు. సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.


కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము. నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము. మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.


పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది. నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.


కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు!


ఆ ప్రజలు నీ బలాన్ని చూచి భయంతో నిండిపోతారు యెహోవా ప్రజలు దాటి పొయ్యేంత వరకు ఆ ప్రజల్ని నీవు దాటించేంత వరకు వాళ్లు బండలా మౌనంగా ఉండిపోతారు.


పట్టణాలను నాశనం చేసినవాడు వీడేనా? దేశాన్ని ఎడారిగా మార్చినవాడు వీడేనా? యుద్ధంలో మనుష్యుల్ని బంధించి, వారిని ఇంటికి వెళ్లనీయనివాడు వీడేనా?”


ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు. మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.


“‘అని నీవు చెప్పావు. అయితే నేను చెప్పినది నీవు వినలేదా? అష్షూరు రాజా, దేవుడనైన నేనే ఆ సంగతులను చేశానని నిశ్చయంగా నీవు ఎప్పుడో విన్నావు. చాలాకాలం క్రిందట నేను అష్షూరును చేశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి నేనే తీసుకొని వచ్చాను. మిగిలిన ఇతర పట్టణాలను నిన్ను నాశనం చేయనిచ్చాను. నా పనిలో నేనే నిన్ను వాడుకొని, ఆ పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేశాను.


యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోనూ, నీవొక విధ్వంసకర పర్వతానివి. నేను నీకు వ్యతిరేకిని. బబులోనూ, భూమినంతటినీ నీవు నాశనంచేశావు. నేను నీకు విరోధిని. నీ మీదికి నా చేయి చాస్తున్నాను. కొండ శిఖరాల నుంచి నిన్ను దొర్లిస్తాను. నిన్నొక కాలిపోయిన కొండలా చేస్తాను.


నా శత్రువు ఇది చూసి సిగ్గుపడతాడు. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నడిగాడు. ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టిమీద నడిచినట్లు జనులు ఆమెమీద నడుస్తారు.


నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువా, నన్ను చూచి నవ్వకు! నేను తిరిగి లేస్తాను. నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను. కానీ యెహోవాయే నాకు వెలుగు.


చివరి శత్రువైన మృత్యువు నాశనము చేయబడుతుంది.


అతడు ఘటసర్పాన్ని పట్టుకొని వెయ్యి ఏండ్లదాకా బంధించి వేసాడు. దీన్ని ఆది సర్పమని, దయ్యమని, సాతానని అంటారు.


దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు సిక్లగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిక్లగును ముట్టడివేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేసారు. వారు సిక్లగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు.


లోయకు అవతల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు సైన్యం పారిపోవటం చూశారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం కూడ వారు చూశారు. కనుక ఆ ఇశ్రాయేలీయులు తమ నగరాలను వదిలి పారిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆ నగరాలను ఆక్రమించుకొని వాటిలో నివసించసాగారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ