Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 74:1 - పవిత్ర బైబిల్

1 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా? నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱెలమీద నీ కోపము పొగరాజు చున్నదేమి?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 దేవా, నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు మేపే గొర్రెల మీద ఎందుకు కోపగించుకుంటున్నావు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు? మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు? మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 74:1
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

అక్కడ ఇంకా నావారు కొద్ది మంది వుండవచ్చు. కాని నేను వారిని విడిచిపెడ్తాను. నేను వారిని వారి శత్రువుల పరము చేస్తాను. వారి శత్రువులు వారిని బందీలుగా చేస్తారు. వారు యుద్ధాలలో సైనికులు అపహరించుకు వెళ్లే అమూల్య వస్తువుల వంటివారు.


యెహోవా, నీవెందుకు అంత దూరంగా ఉంటావు? కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు.


యెహోవా దేవుడని తెలుసుకొనుము. ఆయనే మనలను సృజించాడు. మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.


ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది. యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి. నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి.


నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది. నా సహాయమా! నా దేవా!


ఆశ్రయ బండ అయిన నా దేవునితో, “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.


కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.


దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు. సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.


దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు. నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు. దయచేసి మమ్ములను ఉద్ధరించుము.


దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు. కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.


“మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా? ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?


దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా? ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?


నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి. నేను చెప్పే విషయాలు వినండి.


మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం. మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము. దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.


దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా? బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?


నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు. నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.


దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము! నీ ప్రజలను సంతోషింపజేయుము.


ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము. మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.


అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు.


కానీ, యెహోవా, నీవు మా తండ్రివి. మేము మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి. నీ చేతులే మమ్మల్ని అందర్ని చేశాయి.


“యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.


యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “ఇశ్రాయేలు సంతతిని నేనెన్నడు తిరస్కరించను. ప్రజలు ఆకాశాన్ని కొలవగలిగిననాడు, వారు భూమి యొక్క సర్వ రహస్యాలను తెలిసికోగలిగిననాడు! నేను ఇశ్రాయేలీయుల సంతతి వారిని తిరస్కరిస్తాను. అప్పుడు మాత్రం వారు చేసిన అకృత్యాల కారణంగా నేను వారిని తిరస్కరిస్తాను” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.


నీవు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు. నీవు మాపట్ల మిక్కిలి కోపం వహించావు.


“నా గొర్రెల్లారా, నా పచ్చిక బయలులో ఉండే నా గొర్రెల్లారా మీరు కేవలం మానవ మాత్రులు. నేను మీ దేవుడను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


“నా జీవముతోడుగా మీకు నేనిలా మాట ఇస్తున్నాను. అడవి జంతువులు నా మందను పట్టుకున్నాయి. అవును, నా మంద అన్ని క్రూర జంతువులకూ ఆహారమయ్యింది. ఎందువల్లనంటే వాటికి నిజమైన కాపరిలేడు. నా గొర్రెల కాపరులు నా మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకోలేదు. మరియు ఆ కాపరులు కేవలం నా మందను చంపుకు తిన్నారే గాని, దానిని మేపలేదు.”


“మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు.


ఆ వ్యక్తిని యోహోవ క్షమించడు. మరియు, ఆ వ్యక్తిమీద యెహోవాకు కోపం వస్తుంది, యెహోవా ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వంశాలన్నింటి నుండీ యెహోవా అతణ్ణి వేరు చేసేస్తాడు. యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన కీడులన్నీ అతనికి సంభవిస్తాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడికలో ఆ విషయాలన్నీ ఒక భాగం:


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ