Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 73:3 - పవిత్ర బైబిల్

3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను. ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 73:3
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు. దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు. వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే.


మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడుతున్నారు. దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల విషయమై నిర్దోషులు కలవరపడుతున్నారు.


దుర్మార్గులు చాలాకాలం బ్రతుకుతారెందుకు? వారు ముసలివాళ్లవ్వటం, విజయం పొందటం ఎందుకు?


ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో కాని దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.


ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు. కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు. దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు.


దుర్మార్గుల పట్ల కోపగించకుము చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.


యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము. చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము. చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.


దుర్మార్గులను చూచి అసూయపడకు. అయితే యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల అయినంత గట్టిగా ప్రయత్నించు.


దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు.


కొంతమంది మనుష్యులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు.


నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను.


యెహోవా, నేను నీతో వాదించినట్లయితే, నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు! కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలనుకొంటున్నాను. దుర్మార్గులు ఎందుకు విజయవంతులవుతున్నారు? నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు?


గర్విష్ఠులు సంతోషంగా ఉన్నారని మేము అనుకొంటున్నాం. దుర్మార్గులే అభివృద్ధి చెందుతున్నారు. వారు దేవుని సహనం పరీక్షించటానికి చెడు పనులు చేస్తారు-దేవుడు వారిని శిక్షించడు అని మీరు చెప్పారు”.


లేఖనాల్లో ఈ విషయం వృధాగా వ్రాసారనుకుంటున్నారా? “ఆయన మనకిచ్చిన ఆత్మను మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ