కీర్తన 71:22 - పవిత్ర బైబిల్22 స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను. నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 నా దేవా, నేను కూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించె దను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 నా దేవా, నేను నీ యథార్థ క్రియలను బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తిస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను; ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా, నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను; ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా, నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. గడ్డి, ఆకులు అగ్నితో కాల్చివేయబడినట్టు, వారి సంతతివారు పూర్తిగా నాశనం చేయబడతారు. చచ్చి, ధూళిగా తయారయ్యే వేరులా వారి సంతానంవారు పూర్తిగా నాశనం చేయబడతారు. అగ్ని నాశనం చేసిన ఒక పువ్వులా వారి సంతతివారు నాశనం చేయబడతారు. దాని బూడిద గాలితో కొట్టుకొని పోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ఉపదేశాలకు విధేయులయ్యేందుకు వారు నిరాకరించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) సందేశాన్ని ఆ ప్రజలు అసహ్యించుకొన్నారు.
మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు శాశ్వతంగా జీవించేవాడు, పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు: “నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను. అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను. ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను. హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.
దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి. తర్షీషు మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి. మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు తీసుకొని వస్తాయి. నీ దేవుడు యెహోవాను గౌరవించుటకు ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఇది జరుగుతుంది.