Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 71:14 - పవిత్ర బైబిల్

14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను. నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 నేను అన్నివేళలా నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 నా మట్టుకైతే, నేనెల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాను; నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని స్తుతిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 నా మట్టుకైతే, నేనెల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాను; నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని స్తుతిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 71:14
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ముతూనే వుంటాను. ముఖాముఖిగా, ఆయన ముందు నా విధానాలను రుజువు చేస్తాను.


ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది. యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.


నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను? దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి. నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది. నా దేవుడే నాకు సహాయము.


నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను. నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు. నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.


కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది. నేను ఇలా అనుకున్నాను.


“యెహోవా నా దేవుడు. అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.


ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.


యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచియుండటం క్షేమకరం


ఇదే నా ప్రార్థన: మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి.


నిజానికి మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.


అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది.


అందుచేత కార్యసిద్ధికోసం మీ మనసుల్ని సిద్ధం చేసికొంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కందివ్వబోయే అనుగ్రహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండండి.


మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.


ఇలాంటి ఆశాభావాన్ని ఉంచుకొన్న ప్రతి ఒక్కడూ ఆయనలా పవిత్రమౌతాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ