Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 7:13 - పవిత్ర బైబిల్

13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 అతని మీద ఉపయోగించడానికి ఆయుధాలు సిద్ధం చేస్తాడు. తన బాణాలను అగ్ని బాణాలుగా చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 7:13
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి. ఈ బాణాల విషం నా ఆత్మను తాకుతుంది. దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపి నాకు విరోధంగా ఉంచబడ్డాయి.


వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు. వారి బాణాలను వారు గురి చూస్తారు. మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.


యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము. నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.


యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు, అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి.


నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.


వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు. వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.


కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు. అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.


ఒక శత్రువులా యెహోవా తన విల్లు వంచాడు. అయన కుడిచేయి తన ఖడ్గం ఒరమీద వుంది. బాగా కన్పించే యూదా మనుష్యులందరినీ ఆయన చంపివేశాడు. యెహోవా ఒక శత్రువులా వారిని హతమార్చినాడు. యెహోవా తన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన దానిని సీయోను గుడారాలపై కుమ్మరించాడు.


సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి. నీ దేదీప్యమానమైన మెరుపు కాంతులు చూడగానే అవి ప్రకాశించటం మానివేశాయి. ఆ మెరుపులు గాలిలో దూసుకుపోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి.


నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు. అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు. ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు. ఆ కుటుంబం దేశంలో అతి తక్కువదా, లేక అతి గొప్పదా అనే విభేదం నీవు చూపలేదు.


“‘ఇశ్రాయేలీయుల మీద నేను కష్టాలు ఉంచుతాను. నేను వాళ్లమీద నా బాణాలు విసురుతాను.


నేను ప్రమాణం చేస్తున్నాను, తళతళలాడే నా ఖడ్గానికి పదునుపెడ్తాను. నా శత్రువుల్ని శిక్షించటానికి దానిని నేను ఉపయోగిస్తాను. నేను వారికి తగిన శిక్ష యిస్తాను.


నా శత్రువులు చంపబడతారు, ఖైదీలుగా తీసుకొనిపోబడతారు. నా బాణాలు వారి రక్తంతో కప్పబడి ఉంటాయి. నా ఖడ్గం వారి సైనికుల శిరస్సులను ఛేదిస్తుంది.’


దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టినవాళ్ళకు కష్టం కలిగిస్తాడు.


వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు. దానికి తగిన విధంగా నీవు వాళ్ళకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు.”


వాళ్ళు పెద్ద స్వరంతో, “మహా ప్రభూ! నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించేవాళ్ళపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ