Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 67:4 - పవిత్ర బైబిల్

4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక! ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ప్రజలు సంతోషంతో ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు జాతులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూరాజ్యాలను ఏలుతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 67:4
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”


నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను. భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!


నేను (దేవుడు) మీతో చెప్పాను, “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.


భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు. యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.


యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి! కనుక ప్రపంచం నాశనం చేయబడదు. యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.


యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు గనుక ఆయన ఎదుట పాడండి. ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.


ఓ స్త్రీ, సంతోషంగా ఉండు! నీకు పిల్లలు పుట్టలేదు, కానీ నీవు చాలా సంతోషంగా ఉండాలి. “భర్తగల స్త్రీకంటె ఒంటరి స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కంటుంది.” అని యెహోవా చెబుతున్నాడు.


రాజ్యాలన్నింటిలో నా శక్తికి దావీదును సాక్షిగా నేను చేశాను. దావీదు అనేక రాజ్యాలకు పరిపాలకునిగాను, సర్వసేనానిగాను ఉంటాడని నేను అతనికి వాగ్దానం చేశాను.”


మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు నీ దేశంలో నిండిపోతాయి. షేబనుండి ఒంటెలు బారులు తీరి వస్తాయి. బంగారం, బోళం అవి తెస్తాయి. ప్రజలు యెహోవాకు స్తుతులు పాడతారు.


ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”


కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది.


దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా! ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా! గట్టిగా కేకలు వేయి! ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.”


“దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషించాలి. ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక. తన సేవకులను చంపే వాళ్లను ఆయన శిక్షిస్తాడు గనుక. ఆయన తన శత్రువులకు తగిన శిక్షయిస్తాడు. ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ