Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 66:3 - పవిత్ర బైబిల్

3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి: దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 –నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం! మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం! మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 66:3
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

“దేవుడే పాలకుడు. ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి. దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.


ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు. ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు.


ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.


మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు.


దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు. నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు. వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.


ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము. ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము ఆ రాజ్యాలను యుద్ధంలో నీవు ఓడించావు. ఇప్పుడు వారు నీ వద్దకు వెండి తీసుకొని వచ్చునట్లు చేయుము.


దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు. భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.


యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు, అందుచేత వారు శిక్షించబడతారు.


“ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక యెహోవాకు గానం చేయండి గుర్రాలను, దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసాడు.”


బండల చాటున, నేల బీటల్లో మనుష్యులు దాక్కొంటారు. యెహోవాను గూర్చి ఆయన మహా ప్రభావం గూర్చి ప్రజలు భయపడ్తారు. ఇదంతా భూమిని గజగజ వణకించుటకు యెహోవా నిలబడినప్పుడు జరుగుతుంది.


బలమైన రాజ్యాల ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. బలమైన పట్టణాల బలాఢ్యులు నీకు భయపడతారు.


పైన ఆకాశాలను చూడు. ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు? ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు? ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు? సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు, అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.


(కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.)


కాని యెహోవా నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు! శాశ్వతంగా పాలించే రాజు ఆయనే. దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది. ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ