Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 61:4 - పవిత్ర బైబిల్

4 నీ గుడారంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. సెలా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 మీ గుడారంలో చిరకాలం నివసించాలని మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. సెలా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 మీ గుడారంలో చిరకాలం నివసించాలని మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. సెలా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 61:4
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?


నీ కంటిపాపవలె నన్ను కాపాడుము. నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.


నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి. మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.


యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది. నేను అడిగేది ఇదే: “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట. ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”


దేవా, నన్ను కరుణించు నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము. కష్టం దాటిపోయేవరకు నేను నీ శరణు జొచ్చియున్నాను.


అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము. నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.


నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి. ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం


నీవు నిజంగా నాకు సహాయం చేశావు. నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.


ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.


మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.


కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.


మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు. వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.


యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు.


“ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు.


అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు. తానివ్వబోయేవాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్నవాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు.


అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను.


నీవు చేసిన ఈ మంచి పనులన్నిటికీ యెహోవా నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ ఇశ్రాయేలు వారి దేవుని దగ్గర ఆశ్రయము కోరి వచ్చావో ఆ యెహోవా దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునుగాక! మరియు ఆయన నిన్ను కాపాడునుగాక.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ